Begin typing your search above and press return to search.
అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి!
By: Tupaki Desk | 12 Jun 2022 10:30 AM GMTజంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో రీ డెవలప్మెంట్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే టెండర్లను సైతం పిలిచింది. టెండర్లు ఖరారు కాగానే సుమారు మూడేళ్లలో వాణిజ్య సముదాయాలతో పాటు మాల్స్, థియేటర్లు, హోటళ్లను నిర్మించనున్నారు. టెండరు ప్రక్రియ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. సికింద్రాబాద్‌తోపాటు తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కూడా రైల్వే శాఖ టెండర్లను పిలిచింది. వీటి అభివృద్ధి అనంతరం మరిన్ని ముఖ్యమైన స్టేషన్ల రీ డెవలప్మెంట్ జరగనుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దక్షిణమధ్య రైల్వే కేంద్రంగానే కాకుండా భారతీయ రైల్వేలోని రద్దీ స్టేషన్లో ఒకటిగా ఉంది. అటు ఉత్తర భారతదేశాన్ని, ఇటు దక్షిణ భారతదేశాన్ని కలపడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి వసతులతో తీర్చిదిద్దాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిన నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో దక్షిణమధ్య రైల్వే అధికారులు టెండర్లను పిలిచారు. దీనికి సంబంధించి జూన్ 21వ తేదీన ప్రీ బిడ్ సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జూలై 29వ తేదీన ఈ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయి ఏజెన్సీకి బాధ్యతలను అప్పగించగానే మూడేళ్లలో 36 నెలల్లో దీని రీ డెవలప్మెంట్ను పూర్తి చేయాలని ఏజెన్సీకి దక్షిణమధ్య రైల్వే గడువు విధించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తే నగరంలోని ప్రధాన భాగం అభివృద్ధి చెందుతుంది. బహుళ రవాణా వ్యవస్థతో ప్రయాణికులు ఒక చోట నుంచి మరో చోటుకి ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు. రైలు ప్రయాణికులకు స్టేషన్లో మెరుగైన ప్రయాణ అనుంధానం ఉంటుంది. ప్రయాణికులను దింపడానికి, చేర్చడానికి అనువైన ప్రదేశాల ఏర్పాటుతో పాటు తగినంత పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. రద్దీ ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి, నగర రోడ్డు నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి ఇది తోడ్పాడునందిస్తుంది. రైల్వే స్టేషన్, చుట్టుపక్కల ట్రాఫిక్ వ్యవస్థ మెరుగవుతుంది. స్థానిక సంస్థల వ్యాపారాలకు వ్యాపార అవకాశాలు కల్పించి ఆదాయం పెరగడానికి నూతన సిటీ సెంటర్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుత ఉత్తరం వైపు భాగంలో జీ + 3 అంతస్తులు – 22,516 చదరపు మీటర్లతో నూతన స్టేషన్ భవనం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రస్తుత దక్షిణం వైపు భాగంలో భవనం జీ + 3 అంతస్తులు – 14,792 చదరపు మీటర్లతో విస్తరణ, అభివృద్ధిని చేపట్టనున్నారు. 108 మీటర్లతో రెండు అంతస్తుల స్కై కాన్కార్స్ నిర్మాణం. మొదటి అంతస్తు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రెండో అంతస్తు ప్రజలకు రూఫ్ టాప్ ప్లాజాగా (24,604 చదరపు మీటర్లు) అందుబాటులో ఉంటుంది.
అదేవిధంగా స్టేషన్ ఉత్తరంపై ఒక మల్టీ లెవల్ (ఐదు లెవల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలని) దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. దీంతోపాటు స్టేషన్‌లోని దక్షిణం వైపున విడిగా ఒక అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా ప్రవేశించే, బయటకు వెళ్లే మార్గాల్లో (డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ ప్రదేశాలు) ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా వచ్చేవారికి, బయలు దేరే ప్రయాణికులకు, వాహనాల కదలికలకు ఇబ్బందులు ఉండవు. దీంతోపాటు 5000 కేవిపి సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.