Begin typing your search above and press return to search.

షా భ‌ద్ర‌త ఖ‌ర్చు చెబితే ఆయ‌న‌కు డేంజ‌రా?

By:  Tupaki Desk   |   27 Aug 2018 6:00 AM GMT
షా భ‌ద్ర‌త ఖ‌ర్చు చెబితే ఆయ‌న‌కు డేంజ‌రా?
X
అధికారం చేతిలో ఉంటే అంతే. పేరుకు ప్ర‌జాస్వామ్య‌మే కానీ.. అధికారంలో ఉన్న వారికి త‌గ్గ‌ట్లుగా ప‌రిస్థితులు.. ప‌రిస‌రాలు మారిపోతున్న సిత్ర‌మైన ప‌రిస్థితి దేశంలో నెల‌కొంటోంద‌న్న విమ‌ర్శ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేసే అంశాల‌కు సంబంధించిన లెక్క‌లు బ‌య‌ట‌పెడితే.. భ‌ద్ర‌త‌కు స‌మ‌స్య అంటూ లింకులు వేస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ్య‌వ‌హార‌మే చూడండి. ఆయ‌న‌కు భారీ భ‌ద్ర‌త‌ను కేంద్రం క‌ల్పిస్తోంది. ఒక అధికార పార్టీ అధ్యక్షుడికి భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల్సిన బాధ్య‌త ఉంద‌న్న మాట‌ను ఎవ‌రూ ఏమీ అన‌రు. కాకుంటే.. ఆయ‌న‌కు క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త గురించిన వివ‌రాల్ని వెల్ల‌డించ‌టానికి నో చెప్ప‌టంలోనూ అర్థం ఉంది.

ప్ర‌ముఖుల‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. ప్రాణాల‌కు ముప్పు వాటిల్లుతుందంటూ చేసే వాద‌న‌ను ఎంతోకొంత అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. భ‌ద్ర‌త కోసం పెట్టే ఖ‌ర్చు ఎంత ఉంటుంద‌న్న విష‌యాన్ని సైతం చెప్పేందుకు నో చెప్పేయ‌టంపైనే అభ్యంత‌ర‌మంతా.

ఎందుకంటే.. షా భ‌ద్ర‌తకు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా.. సంవ‌త్స‌రాలు ల‌క్ష రూపాయిలు అవుతుంది.. రెండు ల‌క్ష‌లు అవుతుంది. కాదు కోటి రూపాయిలు ఖ‌ర్చు చేయ‌టం జ‌రుగుతుంద‌న్న మాట‌ను చెప్ప‌టంతోనే కొంప‌లు మునిగిపోయే అవ‌కాశం ఉండ‌దు. ఎందుకంటే.. ఈ మొత్తాన్ని ఎలా లెక్క వేసినా.. దాని కార‌ణంగా జ‌రిగే న‌ష్టం పెద్ద‌గా ఉండ‌దు.

కానీ.. కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ మాత్రం అమిత్ షా భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఖ‌ర్చులు వెల్ల‌డించ‌టానికి నో చెప్పేశారు. ప్ర‌ముఖుల ర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకొని తాము ఈ ద‌ర‌ఖాస్తు వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు తిర‌స్క‌రిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. భ‌ద్ర‌త కోసం చేస్తున్న ఖ‌ర్చు వివ‌రాల్ని చెప్పాల్సి వ‌స్తే.. భ‌ద్ర‌త పొందుతున్న వ్య‌క్తి వ్య‌క్తిగ‌త వివ‌రాలు చెప్పాల్సి ఉంటుంద‌ని.. ఆ ప‌ని చేయ‌లేం క‌నుకే.. భ‌ద్ర‌తా ఖ‌ర్చుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌మ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. భ‌ద్ర‌తా వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేం.. అలా చేస్తే ఇబ్బంది అవుతుంద‌ని చెప్పి.. ఏడాదికి ఎంత ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు అవుతుందో చెబితే కొంప‌లేం మునుగుతాయో అర్థం కానిది. మీకేమైనా ఈ లాజిక్కు అర్థ‌మ‌వుతుందా?