Begin typing your search above and press return to search.

ఉల్లిపాయలకు సెక్యూరిటీ

By:  Tupaki Desk   |   10 Sept 2015 4:22 AM IST
ఉల్లిపాయలకు సెక్యూరిటీ
X
వజ్రాలు.. బంగారం.. వెండి లాంటి విలువైన వస్తువులకు భద్రత కల్పించటం మామూలే. కానీ.. నిత్యవసర వస్తువైన ఉల్లికి కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి దుస్థితి తాజాగా నెలకొంది. మారిన కాలంతో.. ఆకాశాన్ని అంటుతున్న ఉల్లిపాయల ధరలతో ఉల్లిపాయలకు భద్రత ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

చిత్రంగా అనిపించినా ఇది నిజం. ఆ మధ్య ఫూణెలోని ఉల్లిమండీలో 400 కేజీల ఉల్లిపాయల్ని చోరీ చేసిన వైనంతో మేలుకొన్న అక్కడి వ్యాపారులు.. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్నారు. దొంగతనం చేసి పారిపోతున్న దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేయటం.. వ్యాపారుల్ని దొంగలు చితకబాదిన నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు.

ఉల్లి ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. చోరీలకు అవకాశంతో పాటు.. తమ భద్రత కోసం ఫూణె మార్కెట్ కమిటీ ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది. దొంగలకు అవకాశం ఇవ్వకుండా.. ఉల్లికి.. ఉల్లి వ్యాపారులకు భద్రత కల్పించేందుకు వీలుగా ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవటం విశేషం. అంతేకాదు.. ఈ భద్రత కోసం అయ్యే ఖర్చులన్నీ తామే భరించనున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు.