Begin typing your search above and press return to search.
సెక్యురిటీ గార్డు సుడి తిరిగింది.. కోటి సొంతమైంది
By: Tupaki Desk | 10 April 2021 4:02 AM GMTఅతనో సాదాసీదా సెక్యురిటీ గార్డు. కేరళకు చెందిన ఇతడు బతకలేక కర్ణాటకకు వచ్చి.. సెక్యురిటీగార్డుగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. అదెలానంటే.. లక్ కలిసి రావటమేనని చెప్పాలి. కటిక పేదరికం నుంచి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన ఇతని ఉదంతం ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది. మోయిద్దీన్ కుట్టి కేరళ అయినప్పటికీ ఉపాధి కోసం కర్ణాటకలోని మంగళూరుకు వచ్చాడు.
అక్కడో బిల్డింగ్ కు సెక్యురిటీ గార్డుగా వ్యవహరిస్తుంటాడు. అతనికి నిత్యం లాటరీలు కొనే అలవాటు ఒకటి ఉంది. తాజాగా కేరళ భాగ్యమిత్ర లాటరీని కొనుగోలు చేశాడు. ఏప్రిల్ నాలుగున రూ.100 పెట్టి అతను కొన్న లాటరీలో అదృష్టం వరించింది. ఐదుగురికి కోటి చొప్పున లాటరీ తగలగా.. వారిలో మొయిద్దీన్ కుట్టి ఒకరు. ఇంతకాలం తాను నిరీక్షించిన సమయం వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
లాటరీ సొమ్ము తన చేతికి అందిన వెంటనే భార్య.. పిల్లలతో కలిసి తాను తన స్వస్థలమైన కేరళకు వెళ్లిపోతానని చెబుతున్నారు. తానిక సెక్యురిటీ గార్డు పని చేయనని.. చిన్న వ్యాపారం చేసుకుంటూ సొంత రాష్ట్రంలోనే జీవిస్తానని చెబుతున్నాడు.రాత్రికి రాత్రే మారిన పోయిన అతడి అదృష్టంతో స్థానికంగా హాట్ టాపిక్ గా మారాడు.