Begin typing your search above and press return to search.

రాహుల్ పై కేసు పెట్టిన సెక్యూరిటీ గార్డులు

By:  Tupaki Desk   |   13 March 2019 5:21 AM GMT
రాహుల్ పై కేసు పెట్టిన సెక్యూరిటీ గార్డులు
X
స‌భ ఏదైనా కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనికి ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అదే ప‌నిగా చేస్తున్న వ్యాఖ్య ఒక‌టి మ‌హారాష్ట్రకు చెందిన సెక్యురిటీ గార్డుల సంఘానికి కోపం తెప్పించింది. రాఫెల్ కుంభ‌కోణంలో భాగంగా దేశానికి కాపలాగా ఉంటాన‌న్న వ్య‌క్తి దొంగ‌గా మారాడ‌న్న అర్థం వ‌చ్చేలా రాహుల్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై వారు మండిప‌డుతున్నారు. రాహుల్ త‌న ప్ర‌తి ప్ర‌సంగంలోనూ చోకీదార్ చోర్ హై అంటూ చేస్తున్న ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటోంది.

దీంతో రాహుల్ త‌న ప్ర‌సంగంలో చోకీదార్ చోర్ హై అన్న మాట‌ను ప‌లుసార్లు ప్ర‌స్తావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ చేస్తున్న వ్యాఖ్య‌లు త‌మ మ‌నోభావాలు దెబ్బ తీసేలా చేస్తున్న‌ట్లు పేర్కొంటూ సెక్యురిటీ గార్డ్ అసోసియేష‌న్ ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసింది. రాహుల్ పై కేసున‌మోదు చేయాల‌ని కోరుతూ ఈ సంఘ స‌భ్యులు ముంబ‌యి పోలీసుల్ని కోరారు.

రాహుల్ వ్యాఖ్య‌ల‌పై మ‌హారాష్ట్ర రాజ్య సుర‌క్షా ర‌క్ష‌క్ యూనియ‌న్ స‌భ్యులు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌రంగా ఉంటున్నాయ‌ని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మ‌ధ్య‌న ఎంఎంఆర్డీఏ మైదానంలో నిర్వ‌హించిన స‌భ‌లో రాహుల్ మాట్లాడుతూ కాప‌లా వ్య‌క్తే దొంగ‌గా మారాడ‌న్న వ్యాఖ్య చేశార‌ని.. ఈ మాట‌లు కాప‌లాదారుల్ని అవ‌మానించేలా ఉన్నాయ‌ని.. ఇలాంటి వ్యాఖ్య‌ల్ని అడ్డుకోవాల‌ని వారు కంప్లైంట్ కాపీలో పేర్క‌న్నారు.

రాహుల్ పై వెంట‌నే కేసు న‌మోదు చేయాల‌న్న డిమాండ్ ను వారు వినిపించారు. మ‌రి.. దీనికి ముంబ‌యి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ సెక్యురిటీ సిబ్బంది మనోభావాల్ని గౌర‌విస్తూ త‌న ప‌వ‌ర్ ఫుల్ డైలాగుకు రాహుల్ చెక్ చెబుతారా? కంటిన్యూ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఇలా ప్ర‌తి మాట‌కు.. ఏదో ఒక సంఘం స‌భ్యుల మ‌నోభావాలు దెబ్బ‌తింటూ ఉంటే.. నేత‌ల నోటికి తాళం వేసుకోవాల్సిందేన‌న్న మాట వినిపిస్తోంది.