Begin typing your search above and press return to search.
మోడీ సభలో ఆమెకు ఎంత అవమానమంటే..
By: Tupaki Desk | 8 March 2017 5:24 PM GMTప్రధాని సభలో ఒక మహిళా నేతకు తీవ్ర అవమానం జరిగినట్లుగా చెబుతున్నారు. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక మహిళా ప్రజాప్రతినిధికి జరిగిన అవమానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి యూపీలోని గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు షాలిని రాజ్ పుత్. ఆమె ప్రధాని మోడీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరై.. తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావాలని భావించారు. ఇందుకోసం ఆమె యూపీ నుంచి బయలుదేరి మరీ వచ్చారు.
ప్రధాని పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన ఆమెను.. మోడీని కలుసుకునేందుకు అనుమతించలేదు. తాను మహిళా సర్పంచ్ నని.. తమకు యూపీ సర్కారు నుంచి సహకారం అందటం లేదని.. ఆ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనని తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. అయినప్పటికీ తన మాటను ప్రధాని సిబ్బంది వినకపోగా.. పక్కకు ఈడ్చుకెళ్లినట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మహిళా సర్పంచ్ పట్ల అధికారులు ఇంత దారుణంగా వ్యవహరిస్తే మరోవైపు.. ఇదే సభలో మాట్లాడిన మోడీ మాత్రం.. బాలికా శిశువుల భ్రూణ హత్యల్ని అస్సలు ఒప్పుకోకూడదని.. ఇందుకు మహిళా సర్పంచ్ లను కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మాటలు ప్రధాని మోడీ నోటి వెంట వస్తున్న వేళలోనే.. ఒక మహిళా సర్పంచ్ కుఊహించని రీతిలోప్రధాని సిబ్బంది చేతిలో అవమానం ఎదురుకావటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/