Begin typing your search above and press return to search.
పొగిడి మరీ దేశద్రోహం కేసు వేయించుకుంది
By: Tupaki Desk | 23 Aug 2016 7:06 AM GMTసెలబ్రిటీలకు అడ్వాంటేజీలతో పాటు.. అన్నే కష్టాలు ఉంటాయి. సామాన్యుడి చేసే వ్యాఖ్యకు వాటికి ఉండే స్పందనకు.. ఒక సెలబ్రిటీ చేసే వ్యాఖ్యకు మధ్య తేడా చాలానే ఉంటుంది. అందుకే ప్రముఖులు ఏదైనా విషయం మీద స్పందించాల్సి వస్తే ఆచితూచి మాట్లాడతారు. ఇక.. వివాదాస్పద విషయాల జోలికి వెళ్లేందుకు సుతారమూ ఇష్టపడరు. కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరి చేత వేలెత్తి చూపించుకునేలా చేసుకుంది కన్నడ నటి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో తనను అభిమానించే వారు సైతం ఇప్పుడు ఆమెకు అండగా నిలవని పరిస్థితి. ఇంతకీ ఆ నటి ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. కన్నడ నటి కమ్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య. ఇటీవల పాక్ కు వెళ్లి వచ్చిన ఆమె దాయాది దేశాన్ని పొగిడేసి ట్రబుల్స్ లో పడ్డారు.
రాహుల్ గాంధీ బ్యాచ్ అన్న ముద్ర వేయించుకున్నట్లు చెప్పే నటి రమ్య వ్యాఖ్యలు కేంద్రమంత్రి పారికర్ చేసిన ఒక వ్యాఖ్యకు కౌంటర్ అన్నట్లుగా ఉండటం గమనార్హం. అయితే.. ఆ కౌంటర్ దేశానికి వ్యతిరేకంగా.. దాయాది దేశానికి అనుకూలంగా ఉండటంతో ఆమె ఇబ్బందుల్లో పడ్డారు. ఓపక్క పాక్ కారణంగా కశ్మీర్ రక్తసిక్తమవుతూ.. కల్లోలంగా ఉన్న వేళ.. పాక్ ను పొగిడేసిన ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. కర్ణాటక లోని మదికేరికి చెందిన న్యాయవాది ఒకరు తాజాగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు.
‘‘కొందరు అన్నట్లు పాకిస్థాన్ నరకమేమీ కాదు. అక్కడి ప్రజలంతా మనలాంటి వారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు’’ అంటూ రమ్య చేసిన వ్యాఖ్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విట్టల్ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. ఈ శనివారం ఈ కేసు విచారణ కోర్టు ముందుకు రానుంది. ఎవరిని ఎప్పుడు పొగడాలో రమ్యకు తెలీదా? అంటూ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఏమైనా పొగిడి మరీ దేశద్రోహం కేసు పెట్టించుకోవటం రమ్యకు మాత్రమే సాధ్యమవుతుందేమో..?