Begin typing your search above and press return to search.
వైసీపీకి జై కొడితే ఇలా ఉంటుంది?
By: Tupaki Desk | 19 Jun 2020 6:30 AM GMTఅధికారం బెల్లం లాంటిది. దానిలో ఉండే మజానే వేరు. ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీలో ఉన్న నేతలను నయానో భయానో బెదిరించి అధికార ప్రతిపక్షం లాగేసుకుంటోంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ ఆస్తులు కాపాడుకోవడానికి.. వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండడానికి అధికార వైసీపీకి జై కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇప్పటికే జగన్ కు ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జైకొట్టి టీడీపీకి దూరంగా జరిగారు. 10మంది వరకు టీడీపీ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కూడా తన గ్రానైట్ పరిశ్రమలపై వైసీపీ ప్రభుత్వం నజర్ పెట్టడంతో దెబ్బకు వైసీపీలో చేరిపోయారు. ఇన్నాళ్లు ఆయనపై కక్షగట్టిన వైసీపీ సర్కార్ ఇప్పుడు ప్రేమ చూపిస్తోంది.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు ఇటీవలే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసిన వైసీపీ ప్రభుత్వం.. పార్టీ మారగానే కనికరించింది. ఏకంగా శిద్ధా రాఘవరావు రక్షణ కోసం గన్ మెన్లను కూడా కేటాయించడం విశేషం. ఎస్పీ ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద వచ్చి గన్ మెన్లు శిద్దా వద్ద బాధ్యతలు చేపట్టారు.
ఇదంతా ఆయన తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి చేరడంతో జరిగిన కథ. ఇన్నాళ్లు గన్ మెన్లు లేని ఆయనకు వైసీపీలో చేరగానే ఉన్నపళంగా వచ్చి చేరారు. ఇలా వైసీపీకి జై కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే నేతలకు అర్థమవుతోంది.