Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ఈ జనాల ఆనందం చూడండి
By: Tupaki Desk | 16 Jan 2021 2:29 PM GMTదాదాపు ప్రపంచమంతా సంవత్సర కాలంగా లాక్ అయిపోయింది. కరోనా మహమ్మారి దెబ్బకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏడాదిగా లక్షలమందిని పొట్టనపెట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధిని కరోనా దూరం చేసింది. ఆ పీడ పోవాలని జనాలు తొక్కని గడప లేదు.. మొక్కని దేవుడు లేడు. ఎలాగైతేనేం.. మన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. కరోనా టీకా దేశంలో అందుబాటులోకి వచ్చేసింది.
జనవరి 16 అయిన ఈరోజు నుంచి టీకా పంపిణీ కూడా ప్రారంభమైపోయింది. ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీని ఘనంగా లాంచ్ చేశారు.
ఇప్పటికే ఆమోదం పొందిన కోవాగ్జిన్, కోవీషిల్డ్ వ్యాక్సిన్ లు అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేశారు. అయితే అన్ని రాష్ట్రాల్లో కంటే భిన్నంగా చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రజలు వ్యాక్సిన్ ను ఆదరించారు.

కరోనా మహమ్మారికి మందు వచ్చిందని వ్యాక్సిన్ తరలించే వ్యాన్ ముందర డప్పు చప్పుళ్లతో జనాలు సందడి చేశారు. బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మహమ్మారి నుంచి ప్రజలకు ఊరట దక్కిందని ఇక్కడి జనాలు ఆనందంతో చిందులేశారు. ఇప్పుడు చత్తీస్ ఘడ్ ప్రజల అపూర్వ స్పందన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.