Begin typing your search above and press return to search.
చంద్రబాబు కుట్రతోనే సెక్స్ వేధింపుల ఆరోపణలు: లక్ష్మీపార్వతి
By: Tupaki Desk | 7 April 2019 3:58 PM GMTలైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకున్న లక్ష్మీపార్వతి తాజాగా నోరు విప్పారు. ఇదంతా చంద్రబాబు కుట్రని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక తానేంటో చూపిస్తానని.. అందరి భరతం పడతానని అన్నారు. పక్కా ప్రణాళికతో కోటి అనేవాడిని తన ఇంటికి పంపి ఈ నాటకమంతా ఆడించారని ఆమె ఆరోపించారు.
తనపై వచ్చిన అసత్య ఆరోపణల విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఒక సినిమా డైరెక్టర్ ఈ కోటిని తన ఇంటికి తెచ్చారని.. తనది గుంటూరు జిల్లా వినుకొండ అని చెప్పాడని.. ఇంటికొచ్చిన మనిషిని సాదరంగా ఆహ్వానించడమే తాను చేసిన తప్పని అన్నారు. తనకేదైనా ఉద్యోగం చూపించమని కోటి అడిగాడని... ఆ తరువాత ప్రతి నెలా తన తల్లి కోసం మందులు తెచ్చి ఇచ్చేవాడని చెప్పారు. అంతకుమించి అతనితో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
చంద్రబాబు కుట్రపూరితంగానే కోటిని తన ఇంటికి పంపించి ఇలాంటి ఆరోపణలు చేయించారని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అందరి పని పడతానన్నారు. ఎన్టీఆర్ గౌరవం పోరాదన్న ఉద్దేశంతో తాను నిశ్శబ్దంగా ఉన్నానని.. తాను కనుక ఒక్కసారి నోరు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తరువాతా ప్రజల్లో తనపట్ల గౌరవం మరింత పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదని లక్ష్మీపార్వతి అన్నారు.