Begin typing your search above and press return to search.

వై దిస్ కుల వెర్రి.. సింధు గెలుపులోనూ కులం చేస్తోన్నారా ?

By:  Tupaki Desk   |   2 Aug 2021 5:30 PM GMT
వై దిస్ కుల వెర్రి.. సింధు గెలుపులోనూ కులం చేస్తోన్నారా ?
X
నెటిజ‌న్లంతా ఒకే విష‌య‌మై వెతుకులాట చేస్తున్నారు. అంద‌రికీ ఆమె క్యాస్ట్ పై ఇంట్ర‌స్ట్ ఉంది.. ఆమె ఏ కులం అన్న క‌ల‌వ‌రం అన్ని వ‌ర్గాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఇప్పుడు ఆమె క్యాస్ట్ ఏంటి ? ఒలంపిక్స్ లో ప‌త‌కం సాధించిన ఆనందం క‌న్నా ఇదే ముఖ్యం అని భావించే వారు కోకొల్లలుగా ఉన్న‌ప్పుడు ఇండియా వెలిగిపోతుంది అని అనుకోవ‌డం త‌ప్ప మ‌న‌కు చీక‌టి ఎక్క‌డుంది ? మ‌నుషుల్లో ఇంత‌టి స‌మాన‌త్వ చింత‌న ఉన్న‌ప్పుడు వారు అంత‌టా రాణిస్తారా ? లేదా కులం పేరు చెప్పుకుని ప‌బ్బం గ‌డుపుకుంటారా అన్న‌ది ఓ ప్ర‌శ్న ? ప‌త‌కం గెలిచింద‌న్న ఆనందం క‌న్నా దేశం ప‌త‌నం అయింద‌న్న ఆలోచ‌నే బాధ‌పెడుతుంది ఇప్పుడు.. ఈ నేప‌థ్యంలో ఓ క‌థ‌నం.

కుర్రాళ్లంతా చెడిపోయారు..ముస‌లాళ్లంతా బాగుప‌డ్డారు అని చెప్ప‌డం త‌ప్పు.. అన్ని వ‌య‌సుల వారికీ క‌నీస సంస్కారం ఒక‌టి లేన‌ప్పుడు భార‌తీయుల్లో కుల స్పృహ త‌ప్ప మ‌రొక‌టి ఉండ‌దు అని నిరూప‌ణ అయిన‌ప్పుడు ఎవ‌రి అజ్ఞానాన్ని ఎవరు ప్ర‌శ్నించినా మిగిలే స‌మాధానం ఏమీ ఉండ‌దు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య ప‌త‌క విజేత సింధు విష‌య‌మై గ‌డిచిన రెండు రోజులుగా నలుగుతున్న విష‌యం ఇది. క్యాస్ట్ కార్డ్ పాలిటిక్స్ లో భాగంగా ఆమె ఫ‌లానా అని చెప్ప‌డం ఆ ఫ‌లానా పేరిట ఏవేవో గొప్ప‌లు డ‌ప్పులూ మోగు తుండ‌డం విచార‌క‌రం.

ఇండియా ప‌త‌నంలో ఇదొక భాగం. లేదా ఇండియా వెన‌క్కుపోతోంది చెప్ప‌డం ఇదొక రుజువు. మీరు మీ కులాల‌నూ కుల సంఘాల‌నూ కాపాడుకోండి ఏం కాదు.. అదే ముఖ్యం కానీ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ప‌రిణామాల్లో మీరు చూపించే ఈ అతి కార‌ణంగా దేశం ప‌రువు పోతుంద‌న్న సంగ‌తి గుర్తించండి.. మీ మీ కులంలో సంఘంలో పేద‌లున్నారు వారిని ఆదుకుంటే మీకు కుల స్పృహ ఉన్నా మంచి కార్య‌క్ర‌మాలకు అవి తోడ్పాటు అవుతాయి కానీ మీరు
పిచ్చిలో ఇలా మునిగి తేలుతున్నంత కాలం దేశం ప్ర‌పంచం ఎదుట న‌వ్వుల పాలు కాక త‌ప్ప‌దు.

ఆమె ఏ కుల‌స్తురాలు అన్న‌ది ముఖ్యం కాదు. ఆమె దేశం గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో ఒలింపిక్స్‌లో ప‌త‌కం గెలుచుకుంది. ఆమె మ‌నంద‌రం గ‌ర్వించే భార‌తీయురాలు. ఇన్నేళ్ల ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో ఎవ్వ‌రికి లేని విధంగా ఒలింపిక్స్‌లో రెండు వ్య‌క్తిగ‌త ప‌త‌కాలు సాధించింది. ఆమెది ప్ర‌తి ఒక్క‌రు మెచ్చే మాన‌వ‌కుల‌మే.. అంత‌కు మించి ఏం ఆలోచించ‌కండి కుల‌కుష్టు రోగుల్లారా ?