Begin typing your search above and press return to search.

హాథ్రాస్‌ కేసు టేకప్ చేయనున్న నిర్భయ లాయర్ సీమా

By:  Tupaki Desk   |   2 Oct 2020 4:45 PM GMT
హాథ్రాస్‌ కేసు టేకప్ చేయనున్న నిర్భయ లాయర్ సీమా
X
సీమా కుష్వాహా .. ఈ పేరు దేశంలో బాగా ఫెమస్. నిర్భయ హత్యాచారం కేసును ఓ ఛాలెంజ్‌గా తీసుకుని , ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి , ఎత్తులకి పై ఎత్తులు వేసి చివరికి దోషులకు అన్ని దారులు మూసేసి శిక్షపడేలా చేసిన యువ మహిళా న్యాయవాది. ఈమె తాజాగా హాథ్రాస్‌ కేసులోనూ వాదనలు వినిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు సీమా గురువారం ప్రయత్నించగా స్థానిక పోలీసులు ఆమెని అక్కడికి వెళ్లకుండ అడ్డుకున్నారు. అయితే, తాను మాత్రం వారిని కలవకుండా తిరిగి వెళ్లేదిలేదని తెగేసిచెప్పారు.

సీమా కుష్వాహా మీడియాతో మాట్లాడుతూ ..‘తమ తరఫున నిలబడి న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు. అయితే అధికారులు మాత్రం వారిని కలిసేందుకు అనుమతించడం లేదు. కానీ ఆ కుటుంబాన్ని కలవకుండా నేను తిరిగి వెళ్లేది లేదు అని స్పష్టం చేశారు. బాధితురాలి సోదరుడితో తాను మాట్లాడుతున్నట్టు ఆమె తెలిపారు. హాథ్రాస్‌‌ ఘటనలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెను దారుణంగా హింసించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత అలీగఢ్ యూనివర్సిటీ మెడికాల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తర్వాత ఢిల్లీలో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం ఉదయం మృతిచెందింది.