Begin typing your search above and press return to search.
సీమాంధ్రులు పండగ చేసుకున్నారా?
By: Tupaki Desk | 9 Nov 2015 4:18 AM GMTఅక్కడెక్కడో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ప్రజల్ని కదిలించాయా? అంటే అవుననే చెప్పాలి. రాష్ట్ర విభజన అంశంతో కాంగ్రెస్ మీద విపరీతమైన అగ్రహానికి గురైన వారు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ తీర్పుతో ఏం చేశారో తెలిసిందే. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా చేసిన సీమాంధ్రులు.. మోడీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విభజన కారణంగా తమకు జరిగిన అన్యాయానికి మోడీ ఎంతో కొంత న్యాయం చేస్తారని భావించారు. అందుకు భిన్నంగా.. మోడీ నుంచి సాంత్వన లభించే కన్నా మరింత మండిపోయేలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ ప్రజలకు పండగ లాంటి అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మాట వరసకు ఒక్క వరం అంటే ఒక్క వరం కూడా ప్రకటించకుండా తన దారిన తాను వెళ్లిపోయారు. మోడీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. ఏపీ వరకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి తీపికబురు చెబుతారని.. ఎన్నికల ముందు ఏపీకి ఆదుకుంటానని.. ఏపీ భవిష్యత్తుకు తనదే బాధ్యత అని నమ్మకంగా చెప్పిన మోడీ.. ఇప్పుడు పట్టించుకోకపోవటం సీమాంధ్రుడ్ని విపరీతమైన అసహనానికి గురి చేస్తుంది.
ఇలాంటి నేపథ్యంలో జరిగిన బీహార్ ఎన్నికల్లో.. మోడీ అండ్ కో కు షాక్ తినిపించేలా బీహారీలు తీర్పు ఇవ్వటం సీమాంధ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విభజన కారణంగా ఏర్పడిన నష్టాన్ని పూరించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పిన మోడీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. కేవలం బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రూ.1.10లక్షల కోట్ల ప్యాకేజీని ఆ రాష్ట్రానికి ప్రకటించటం సీమాంధ్రులు మరింత రగిలిపోయేలా చేసింది. తమను మోసం చేసిన మోడీకి.. భారీ ప్యాకేజీ ఇచ్చిన బీహారీలను బుట్టలో వేసుకోవాలని భావిస్తే.. అందుకు భిన్నంగా ఆ రాష్ట్ర ప్రజలు షాక్ ఇవ్వటంపై సీమాంధ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సాక్ష్యాలు చాలానే కనిపిస్తున్నాయి.