Begin typing your search above and press return to search.

50 కరోనా మృతదేహాల ఖననం.. సీతక్క షాకింగ్ పోస్ట్

By:  Tupaki Desk   |   24 July 2020 2:30 PM GMT
50 కరోనా మృతదేహాల ఖననం.. సీతక్క షాకింగ్ పోస్ట్
X
తెలంగాణలోని ఎర్రగడ్డ శ్మశానవాటికలో 50 మంది కరోనా మృతదేహాలను సామూహిక ఖననం నిర్వహించిన వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో ఇంతమంది చనిపోతుంటే ప్రభుత్వం మాత్రం నిజాలు దాస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం లెక్కలు దాచిపెడుతోందని ఆమె ఆరోపించారు.

కాగా దీనిపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. రమేశ్ రెడ్డి స్పందించారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ సమస్యల కారణంగా కరోనా మృతదేహాలను తరలించలేదని.. ఎర్రగడ్డ శ్మశాన వాటికకు 2, 3 రోజుల్లో కరోనాతో చనిపోయిన వారందరినీ ఒకేసారి తరలించి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ సమస్యల కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.

కాగా తెలంగాణలో సామూహిక వ్యాప్తి మొదలైందని.. వచ్చే నాలుగు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. రమేశ్ రెడ్డి సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరారు.