Begin typing your search above and press return to search.
వీరూ ట్వీట్ తో బోర్డుపై ఆక్షింతల వర్షం
By: Tupaki Desk | 7 Aug 2018 4:59 AM GMTవివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండటం తెలిసిందే. అలాంటి కోవకే చెందుతారు మాజీ టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్. అతగాడు క్రీజ్ లో ఉన్నాడంటే చాలు.. మ్యాచ్ టీమిండియా చేతి నుంచి చేజారదన్న భరోసా ఉండేది. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత.. సోషల్ మీడియా ట్విట్టర్ లో అతగాడు పెట్టే పోస్టు తరచూ వార్తాంశాలుగా మారుతుంటాయి.
ఏదైనా అంశంపై సెహ్వాగ్ ట్వీట్ చేశారా.. దానికి మద్దతు భారీగా ఉంటుంది. తాజాగా ఆయన పెట్టిన ఒక ట్వీట్ భారీ చర్చకు తెర తీయటమే కాదు.. బీసీసీఐ ఎంపిక మీద ట్వీట్ ఆక్షింతల వర్షం భారీగా కురిసేలా చేసింది. ఇంతకీ వీరూ పెట్టిన ట్వీట్ ఏమంటే.. టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారాకు ఇంగ్లాండ్ తో తొలి టెస్టుకు చోటు దక్కకపోవటం పై స్పందించిన వీరూ.. అతను ఇంగ్లాండ్ జట్టులో ఆడొచ్చేమో! రెండో టెస్టులో పూజారా భారత జట్టు తరపున ఆడతాడా? ఎంతైనా అది లార్డ్స్ కదా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యతో కూడిన పంచ్ విసిరాడు.
ఇప్పటికే పూజారాను ఎంపిక చేయకపోవటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న క్రికెట్ అభిమానులు వీరూ ట్వీట్ తో చెలరేగిపోయారు. భారత క్రికెట్ జట్టు ఎంపికపై వారు విమర్శనాస్త్రాల్ని సంధించటం స్టార్ట్ చేశారు. టీమిండియా మేనేజ్ మెంట్ తీరును తప్పు పడుతూ.. ధావన్.. దినేశ్ కార్తీక్ కు బదులుగా పూజారా.. రిషబ్ పంత్ ను ఆడించాలని.. మూడు ఫార్మాట్లలో జట్టు ఒకేలా ఉందని ఒకరు ట్వీట్ చేస్తే.. కొత్త కుర్రాళ్లకు అవకాశం వచ్చేది ఎప్పుడంటూ మరొకరు ట్వీట్ చేసి తలంటారు. సోషల్ మీడియాలో తమ ఎంపికపై సాగుతున్న తీవ్ర చర్చతో సెలక్షన్ కమిటీ డిఫెన్స్ లో పడిన పరిస్థితి.