Begin typing your search above and press return to search.
కేజ్రీని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారు
By: Tupaki Desk | 16 Aug 2016 1:31 PM GMTఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పిన సెహ్వాగ్ ఆ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశాడు. కేజ్రీవాల్ మంచి ఆరోగ్యం కలిగి బాగా పనిచేయాలని కోరుకుంటూనే.. ఆయన జలుబు బారిన పడకుండా ఉండాలని సెహ్వాగ్ ఆకాంక్షించాడు. కేజ్రీవాల్ గతంలో పలుమార్లు జలుబు బారిన పడి ఇబ్బంది పడిన నేపథ్యంలో సెహ్వాగ్ ఆ రేంజిలో స్పందించాడన్నమాట. కాగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వీరూకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.
బర్త్ డే బాయ్ కేజ్రీవాల్ కు సెహ్వాగ్ తో పాటుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ - రైల్వే మంత్రి సురేశ్ ప్రభు - బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ - బాలీవుడ్ నటులు రితేశ్ దేశ్ ముఖ్ - అఫ్తాబ్ శివదాసాని సంగీత దర్శకుడు విశాల్ దడ్లానీ - దర్శకుడు శిరీశ్ కుందర్ - బాక్సర్ వీరేందర్ సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ కూడా రాజకీయ శత్రుత్వాన్ని పక్కనపెట్టి కేజ్రీవాల్ కి విషెస్ చెప్పారు. 48వ పడిలో ప్రవేశించిన కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించానని ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ప్రతిగా మోడీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. కాగా మోడీ కూడా గతంలో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించిన సందర్భముంది. తరచూ జలుబుతో బాధపడే కేజ్రీవాల్ కు కర్ణాటకలోని మంచి ఆయుర్వేద వైద్యుడిని సిఫారసు చేశారు. దీంతో కేజ్రీ అప్పటి నుంచి అక్కడే వైద్యం చేయించుకుంటున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ కు జలుబు వదిలిందో లేదో కానీ ప్రముఖులు మాత్రం ఆయన జలుబుపైనే బాగా ఫోకస్ చేస్తున్నారు.