Begin typing your search above and press return to search.

ఆర్​ ఆర్​ వైఫల్యానికి కారణం అదే? టాప్​ సీక్రెట్​ చెప్పిన సెహ్వాగ్​..!

By:  Tupaki Desk   |   26 April 2021 5:32 AM GMT
ఆర్​ ఆర్​ వైఫల్యానికి కారణం అదే? టాప్​ సీక్రెట్​ చెప్పిన సెహ్వాగ్​..!
X
ఆర్​ ఆర్​ వైఫల్యానికి కారణం ఆ జట్టు కెప్టెన్ సంజూ సామ్సన్​ యేనని.. మాజీ క్రికెటర్​, టీమిండియా డ్యాషింగ్​ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టును నడిపించే సత్తా అతడిలో కొరవడిందని కౌంటర్​ వేశారు. మరోవైపు సంజూ కెప్టెన్​ కావడం ఆ జట్టులో చాలా మందికి ఇష్టం లేదని అందుకే ఆ టీం స్పిరిట్​ దెబ్బతింటుందన్నాడు సెహ్వాగ్​. ఓడిపోయినా గెలిచినా.. సమష్టి కృషి అవసరమని చెప్పాడు. ఈ ఏడాదే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రిషబ్​ పంత్​.. ఢిల్లీ క్యాపిటల్స్​ను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడని స్వెహ్వాగ్​ అన్నాడు. పంత్​ ను చూసి .. సంజూ చాలా విషయాలు నేర్చుకోవాలని సూచించాడు.

ఐపీఎల్​ లో తొలి టైటిల్​ను గెలుచుకున్న ఆర్​ఆర్​ ఆ తర్వాత పెద్దగా రాణించడం లేదు. దీంతో కెప్టెన్​ స్మిత్​ స్థానంలో ఆ బాధ్యతలను సంజూ సామ్సన్​ కు అప్పగించారు. అయితే ఆర్​ఆర్​లో ఎంతో మంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, కెప్టెన్​ సంజూ సామ్సన్, డేవిడ్‌ మిల్లర్‌, మోరిస్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఇంత మంది కీలక ఆటగాళ్లు ఉన్నారు. పటిష్ఠమైన బ్యాటింగ్​ లైనప్​ ఉంది. అయినప్పటికీ ఆ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు చేయడం లేదు. అందుకు ప్రధాన కారణం కెప్టెన్​ కమ్యూనికేషన్​ యేనని విమర్శలు వస్తున్నాయి.

జట్టును ముందుకు నడిపించడంలో .. అందరితో కలివిడిగా ఉండటంలో సంజూ విఫలమతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామ్సన్‌ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడంతో ఆర్​ఆర్​ క్యాంపులో అసంతృప్తి మొదలైందని.. అందుకే జట్టు కలివిడిగా ఆడటం లేదని సెహ్వాగ్​ పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌ తో ఆయన ఇటీవల మాట్లాడారు. ‘ ఏ జట్టైనా విజయం సాధించాలంటే సమష్టి కృషి అవసరం. బౌలింగ్​, బ్యాటింగ్​, ఫీల్డింగ్​ ఇలా అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తేనే జట్టు విజయం సాధిస్తుంది. ఇలా అందరినీ ముందుకు నడిపించే బాధ్యత కెప్టెన్​ లో ఉంటుంది.

కానీ ఆర్​ఆర్​ జట్టు చాలా విచిత్రంగా ఉంది. వాళ్లు అసలు కలిసి ఉండటం లేదు. ఎవరికీ వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. బహుశా సంజూ కెప్టెన్​ కావడం వాళ్లకు ఇష్టం లేదేమో. ఈ విషయాన్ని మేనేజ్​ మెంట్​ గ్రహించాలి. బౌలర్​ బౌలింగ్​ చేస్తున్నప్పుడు అతడికి సూచనలు ఇవ్వాలి. ఒకవేళ సదరు బౌలర్​ బౌలింగ్​లో దారాళంగా పరుగులు వచ్చినా.. ఆ బౌలర్​ తో మాట్లాడాలి. అతడిలో ఆత్మవిశ్వాసం నింపాలి. ఫీల్డర్స్​ను కూడా ఎంకరేజ్​ చేయాలి. వాళ్లకు బూస్టింగ్​ ఇవ్వాలి. కానీ సంజూ అవేమి చేయడం లేదు. యాంత్రికంగా ఉన్నాడు’ అని సెహ్వాగ్​ అన్నాడు. మరి సెహ్వాగ్​ సూచనలను ఆర్​ ఆర్​ మేనేజ్​మెంట్ పట్టించుకుంటుందో లేదో? వేచి చూడాలి.