Begin typing your search above and press return to search.

బ్యాంక్ ఉద్యోగుల‌పై సెహ్వాగ్ ట్వీట్‌..

By:  Tupaki Desk   |   5 Feb 2018 3:30 PM GMT
బ్యాంక్ ఉద్యోగుల‌పై సెహ్వాగ్ ట్వీట్‌..
X

పంచ్‌ లేయడంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైలే వేరు. ఏ విషయంలో అయినా తనదైన మార్క్ పంచ్‌లేయడంలో వీరూ దిట్ట. తాజాగా ఇండియా - సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో అంపైర్ల లంచ్ బ్రేక్ నిర్ణయంపై ఎన్ని జోకులు పేలాయో.. ఎన్ని విమర్శలు వెల్లువెత్తాయో తెలిసిందే కదా. దీనిపై సెహ్వాగ్ స్పందించ‌గా... క్రికెట్ మ్యాచ్– బ్యాంక్ ఉద్యోగులకు లింక్ చేసి వేసిన ట్విట్ ఇప్పుడు మంటలు రేపుతోంది. సెహ్వాగ్ వర్సెస్ బ్యాంక్ మధ్య పోరు నడుస్తోంది.

సౌతాఫ్రికాలో జరిగిన సెకండ్ వన్డేలో అంపైర్స్ వ్యవహరించిన తీరు తెలిసింది. మరో రెండు పరుగులు చేస్తే మ్యాచ్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో.. అంపైర్స్ లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ..`ఇండియాలో బ్యాంకులు ఉద్యోగులు.. లంచ్ బ్రేక్ లో కస్టమర్లను పట్టించుకోకుండా వెళ్లిపోతారు.. వాళ్ల కోసం కామన్ మ్యాన్ గంటకొద్దీ నిరీక్షించాలి` అంటూ పోలిక పెట్టి ట్విట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా బీభత్సం చేస్తోంది. జోకులు - విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కస్టమర్లను ఎలా ట్రీట్ చేస్తారో.. ఇండియన్ ప్లేయర్స్‌ ను.. అంపైర్లూ అలాగే చూశారని - లంచ్ కే బాద్ ఆనా అంటూ పంపించేశారని తనదైన స్టయిల్ లో ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ చూసిన బ్యాంక్ ఉద్యోగులు సెహ్వాగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెహ్వాగ్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బ్యాంక్ ఉద్యోగులు చిన్నబుచ్చుకున్నారు. `వీరూ సార్.. మేము కూడా బ్యాంకర్లమే.. కానీ ఎప్పుడూ కస్టమర్లతో అలా వ్యవహరించలేదు` అంటూ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు వీరూ కూడా రిప్లయ్ ఇచ్చాడు. మీరు మినహాయింపులేగానీ.. చాలా వరకు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సగటు జీవికి రోజూ ఎదురయ్యే అనుభవాలే కదా ఇవి అంటూ మళ్లీ హాట్ కౌంటర్ ఇచ్చాడు సెహ్వాగ్. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సెహ్వాగ్ వేసిన రీ కౌంటర్ కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.