Begin typing your search above and press return to search.
రు. 19 వేల కోట్ల ఆస్తుల జప్తు
By: Tupaki Desk | 23 March 2022 1:35 PM GMTబ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన విజయమాల్య, మొహుల్ చోక్సీ, నీరవ్ మోడిలకు చెందిన రు. 19 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఆర్ధికశాఖ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ప్రకటించారు. పై ముగ్గురు వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి అప్పులుగా తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళు దేశం నుంచి పారిపోయారనే కానీ విదేశాల్లో చాలా హ్యాపీగా బతికేస్తున్నారు.
ఆర్ధిక శాఖ మంత్రి చెప్పిన ప్రకారం ముగ్గురు కలిసి రు. 22, 585 కోట్లు ఎగ్గొట్టారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ ఏడాది మార్చి 15 వరకు వీరి ముగ్గురు నుండి రు. 19,111 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది.
జప్తు చేసిన ఆస్తుల్లో రు. 15,130 కోట్లను బ్యాంకులకు అప్పచెప్పేశారట. రు. 335 కోట్ల విలువైన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఎస్బీఐ కన్సార్షియం కు అప్పగించిన ఆస్తులను వేలం వేస్తే రు. 7, 975 వచ్చినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
వీళ్ళే కాకుండా బ్యాంకుల నుండి అప్పుగా తీసుకున్న వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన వాళ్ళింకా ఉన్నారు. విదేశాలకు చెక్కేసిన వాళ్ళను తిరిగి భారత్ కు రప్పించాలంటే చాలా పెద్ద ప్రహసనం అయిపోయింది.
అందుకనే వాళ్ళు విదేశాలకు పారిపోయి సంవత్సరాలవుతున్నా ఇంకా కేసుల విచారణ పూర్తి కావటం లేదు. ఎగ్గొట్టిన అప్పులను నూరుశాతం తిరిగి రాబట్టడం కష్టంగా ఉంది. మరి దేశంలోనే ఎంపీల హోదాలో తిరుగుతున్న వాళ్ళపైన కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది ? వాళ్ళంతా బీజేపీలో ఉండటమో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం వల్లే యాక్షన్ తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి.
మరిలాంటి వాళ్ళపై ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ? ఎప్పుడు అప్పులను రాబట్టుకుంటారో చూడాలి.