Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రియాక్ట్ కాని ఇష్యూపై శేఖర్ కమ్ముల సీరియస్

By:  Tupaki Desk   |   22 Oct 2022 3:29 AM GMT
టాలీవుడ్ రియాక్ట్ కాని ఇష్యూపై శేఖర్ కమ్ముల సీరియస్
X
అందరూ నడిచే దారిలో నడవని దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. తాను తీసే సినిమాలు తక్కువే అయినా.. తన ప్రతి సినిమాను క్లీన్ గా.. ఎంటర్ టైనర్ గా తీసే విషయంలో ఆయన తనదైన ముద్రను టాలీవుడ్ మీద వేశారు. హీరో ఎవరైనా.. శేఖర్ కమ్ముల మూవీ అన్నంతనే దానికో ప్రత్యేక ఇమేజ్ సంతరించుకోవటం తెలిసిందే.

ఆయన తీసిన మూవీలు కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నా.. క్లీన్ మూవీని తీయాలన్నట్లుగా ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ లోనూ కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ దర్శకుల్లో విలక్షణమైన వ్యక్తిత్వం శేఖర్ కమ్ములది. సమాజంలో చోటు చేసుకునే దారుణాలపై టాలీవుడ్ స్పందించేది అప్పుడప్పుడు మాత్రమే. మిగిలిన వారెవరికీ పట్టని హైదరాబాద్ డీఏవీ స్కూల్ దారుణ ఉదంతంపై శేఖర్ కమ్ముల తాజాగా రియాక్టు అయ్యారు.

నాలుగేళ్ల చిన్నారిని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లోని డీఏవీ స్కూల్ లో ప్రిన్సిపల్ డ్రైవర్ గా వ్యవహరించే కామపిశాచి రెండు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేయటం.. డిజిటల్ క్లాస్ రూంలో తన పైశాచిక కాండను అమలు చేయటం లాంటి దారుణాలు బయటకు వచ్చి అందరి నోటా మాట రాకుండా చేసిన వైనం తెలిసిందే. ఈ ఉదంతంపై తాజాగా శేఖర్ కమ్ముల రియాక్టు అయ్యారు.

నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డిన వైనాన్ని ప్రస్తావిస్తూ.."ఇది చాలా ఘోరమైన ఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నా. ధైర్య సాహసాలతో పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు నా జోహార్లు. పిల్లల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఆధునిక సమాజంలో ఇలాంటివి జరగకూడదు.

అందరూ మేల్కొనీ భద్రతకు సంబంధించిన వాతావరనాన్ని కల్పించాలి. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించిన వాళ్లమవుతాం" అని పేర్కొన్నారు. టాలీవుడ్ ప్రముఖుల్ని పెద్దగా కదిలించని ఈ ఉదంతంపై శేఖర్ కమ్ముల రియాక్టు కావటం.. తన ఆవేదనను.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం తర్వాతైనా.. మిగిలిన వారు కళ్లు తెరిచి.. స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.