Begin typing your search above and press return to search.
సొంత ఇలాకాలో పళనికి ఊహించని వ్యతిరేకత
By: Tupaki Desk | 19 Feb 2017 6:10 AM GMTబయట పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇంట్లో సానుకూలత ఉంటే ఆ బలమే వేరుగా ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాజా ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి పళనిస్వామికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సీఎం అయిన నేపథ్యంలో ఆయన అభిమానులు.. కార్యకర్తలు ఆనందోత్సాహాల నడుమ బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు.
ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని ఆశపడిన శశికళకు అక్రమాస్తుల కేసు కారణంగా సీఎం కుర్చీలో కూర్చోలేని నేపథ్యంలో.. తనకు అత్యంతనమ్మకస్తుడైన పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. పళనిస్వామి సొంత ప్లేస్ అయిన సేలంలో ఆయన అభిమానులు.. బలనిరూపణ పరీక్ష పూర్తి అయిన వెంటనే.. విజయోత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడి వరకూ అంతాబాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ అనుభవం ఆయన అభిమానులకు ఎదురైంది.
పళనిస్వామి అనుచరులు ప్రజలకు మిఠాయిలు పంచే ప్రయత్నం చేయగా.. వారు వాటిని తీసుకోవటానికి ససేమిరా అనటమే కాదు.. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం ఆసక్తికరంగా మారింది. తమ ఊరికి చెందినోడు అత్యున్నత స్థానానికి చేరుకున్నాడన్న వార్త విన్న వెంటనే.. ఆనందోత్సాహాలకు గురి కావటం.. పండగ చేసుకోవటం లాంటివి జరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా.. స్వీట్లు తీసుకోవటానికి కూడా నిరాకరించిన వైనం చూస్తే.. తమిళుల్లో శశికళ అన్నా.. ఆమె వర్గీయులన్నా ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/