Begin typing your search above and press return to search.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ మించకూడదు..జగన్ సర్కార్ కి హైకోర్టు షాక్ !
By: Tupaki Desk | 2 March 2020 11:15 AM GMTఅన్ని అనుకున్నట్టుగా జరిగింటే , ఇప్పటికే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవి. కానీ , ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ..స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ,సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ముందుకుపోవడంతో, రిజర్వేషన్ల పై కొందరు కోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రాతిపదికన చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు . కానీ , ఏపీలో వైసీపీ సర్కార్ 59.85 శాతం రిజర్వేషన్ల తో జీవో ఇవ్వడంతో కొందరు కోర్టుని ఆశ్రయించారు.
దీనిపై గతంలోనే హైకోర్టు ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. గతంలో సుప్రీంకోర్టు కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జడ్జిమెంట్‌లో 50 శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే వీరి వాదనతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విబేధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.
ఇక తాజాగా ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు తప్పుబడుతూ ... 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్ ఉండేలా ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇకపోతే రిజర్వేషన్ల పై హైకోర్టు తీర్పుని వెల్లడించడం తో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది అని రాజకీయ వర్గాల సమాచారం. కాగా , మరో రెండు రోజుల్లోనే ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి , ఆ తరువాత వెను వెంటనే పది పరీక్షలు కూడా ఉండబోతున్నాయి. పరీక్షల సమయంలో ఎన్నికల నిర్వహణ అంటే చాలా కష్టం. చూడాలి మరి ప్రభుత్వం ఎన్నికల షెడ్డ్యూల్ ఎలా రెడీ చేస్తుందో ..