Begin typing your search above and press return to search.

`ఆత్మ‌నిర్భ‌ర్‌`.. ఎక్క‌డుంది.. మోడీ సార్‌.. నిప్పులు చెరిగిన శివ‌సేన‌

By:  Tupaki Desk   |   9 May 2021 8:30 AM GMT
`ఆత్మ‌నిర్భ‌ర్‌`.. ఎక్క‌డుంది.. మోడీ సార్‌.. నిప్పులు చెరిగిన శివ‌సేన‌
X
దేశ‌ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై న‌లుదిక్కుల నుంచి విమ‌ర్శ‌నాస్త్రాలు వ‌చ్చిప‌డుతున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ విష‌యంలో ప్ర‌ధాని అనుస‌రించిన విధానంపై ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు, నింద‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ భార‌త వైద్య మండ‌లి ఏకంగా.. త‌న లేఖ‌లో మోడీ నిష్క్రియాప‌ర‌త్వాన్ని మ‌రింత‌గా దుమ్మెత్తి పోసింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు(బీజేపీయేత‌ర‌) సైతం.. మోడీని విమ‌ర్శిస్తున్నాయి. ఇక‌, ఇప్పుడు బీజేపీకి ఒక‌ప్ప‌టి మిత్ర‌ప‌క్షం.. హిందూ అనుకూల వాద పార్టీ.. మ‌హారాష్ట్ర కు చెందిన శివ‌సేన సైతం.. ఇప్పుడు మోడీపై విమ‌ర్శ‌ల బాణాలు సంధించింది.

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్‌ను నిలువ‌రించ‌డంలోను, ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలోను మోడీ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని శివ‌సేన త‌న సొంత ప‌త్రిక సామ్నా సంపాద‌కీయంలో తీవ్ర‌స్థాయిలో చెరిగేసింది. సెకండ్ వేవ్‌పై నిపుణులు హెచ్చ‌రించామ‌ని చెప్పినా.. ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదో.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని.. స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇప్ప‌టికీ.. ఈ దేశం.. గాంధీ-నెహ్రూలు స్థాపించిన వ్య‌వ‌స్థ‌పైనే జీవితాన్ని వెళ్ల‌బుచ్చుతోంద‌ని పేర్కొంది. మార్పు తెస్తాం.. వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను వెళ్ల‌గొడ‌తాం.. అన్న‌వి విధానాలుగా మార‌క‌పోగా.. నినాదాలుగా మాత్ర‌మే స్థిర‌ప‌డ‌డం శోచ‌నీయ‌మ‌ని పేర్కొంది.

ఇక‌, క‌రోనా స‌మ‌యంలో అన్ని విధాలా అతి పెద్ద‌దేశంగా ఉన్న భార‌త్‌.. పేద దేశాల‌కు.. చిన్న దేశాల‌కు సాయం చేసిన రోజులు అంత‌రించిపోయి.. నేడు అవే దేశాల ముందు చేతులు చాపాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని సామ్నా దుయ్య‌బ‌ట్టింది. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అంటూ.. నినాదాలు చేసిన ప్ర‌ధాని మోడీ... ఇప్పుడు వ‌చ్చిన దుస్థితికి, ముఖ్యంగా మ‌న‌క‌న్నా అన్ని విధాలా అణుమాత్రంగా ఉన్న దేశాల నుంచి సాయం తీసుకునేట‌ప్పుడు.. ఈ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ నినాదం ఎటు కొట్టుకుపోయింద‌ని సామ్నా నిల‌దీసింది. ఇలాంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు.. ఇక‌, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అనే నినాదం ఎందుకు.. మ‌డిచి మీ ప్యాకెట్లో పెట్టుకోండి! అంటూ.. తీవ్ర‌వ్యాఖ్య‌లు చేసింది.. సామ్నా!!