Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఎఫెక్ట్ : కత్తి పట్టుకొని మాతాజీ హల్ చల్ !
By: Tupaki Desk | 26 March 2020 11:43 AM GMTకరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలవుతుంటే... ఓ మాతాజీ తన ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు నేను ఆదిపరాశక్తి అవతారమెత్తారు. పొడవైన కత్తి చేతబూని దగ్గరకు వస్తున్న పోలీసులపై బెదిరింపులకు దిగింది. అయితే , [పోలీసులు చాలాసేపు ఆమెకి చెప్పి చూసారు..కానీ , ఎంతకూ మాట వినకపోవడంతో అరెస్టు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ద్యోరియా జిల్లా మెహ్దాపూర్వలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... ప్రధాని మోడీ ఆదేశాలతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తొలిరోజే మాతాజీ తన ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆమె పిలుపుతో లాక్ డౌన్ నియమాలను సైతం పక్కనబెట్టి పొరుగు రాష్ట్రం బీహార్ నుంచి 100 మంది భక్తులు ఆమె కార్యక్రమానికి వచ్చారు. అయితే , చాలామంది ఒకే చోట గుమ్ము గూడటం పై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆమె ఇంటివద్దకు వచ్చారు.
ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. అయితే మాతాజీ అందుకు అంగీకరించలేదు. ఓ పొడవాటి ఖడ్గాన్ని ఝళిపిస్తూ మమ్మల్ని తరలించడానికి వస్తే ఊరుకునేది లేదు. అంటూ హల్ చల్ చేశారు. వెంటనే ఖాళీ చేయకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందంటూ పోలీసులు పలుమార్లు హెచ్చిరించినా ఆమె పట్టించుకోలేదు. నేను ఆదిపరాశక్తిని అంటూ దాదాపు గంటసేపు పోలీసులను చాలా ఇబ్బందులకు గురిచేసింది. దీనితో , విసిగిపోయిన పోలీసులు ఆమె చేతిలో ఉన్న కత్తిని లాక్కుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వండంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.