Begin typing your search above and press return to search.
బుంగమూతి కోసం ఆపరేషన్లు
By: Tupaki Desk | 22 April 2016 10:30 PM GMT‘‘నేను హర్ట్ అయ్యా’’ అంటూ సమంత బుంగమూతి పెడితే.. అడ్డెడ్డె అంటూ కుర్రకారు ఎంతగా ఫీల్ అయిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాము పెట్టే బుంగముతితో మగాళ్ల మనసుల్ని దోచుకునే చాన్స్ ఉందన్న విషయం ఆడాళ్లకు తెలియంది కాదు. బుంగమూతికి మగాళ్లు ఫ్లాట్ కావటమే కాదు.. సెల్ఫీలు క్రేజ్ విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడదో స్టైల్ ఐకాన్ గా మారిపోయింది.
సున్నా చుట్టినట్లుగా బుంగమూతి పెట్టేసి.. ఎంచక్కా ఓ సెల్ఫీ దిగేస్తే ఆ అందమే వేరని ఫీలవుతున్న ఆడోళ్ల సంఖ్య అమెరికాలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆడోళ్లే కాదు బుంగమూతి క్రేజ్ అబ్బాయిలకు బాగానే పట్టింది. మరి.. ఉన్నట్లుండి బుంగమూతి కావాలంటే కష్టం కదా? అన్న డౌట్ అక్కర్లేదు. బాడీలో ఏ పార్ట్ అయినా నచ్చినట్లుగా మార్చేసుకునే శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావటంతో అందమైన బుంగమూతికి అవసరమైన పెదాల కూర్పు కోసం ఆపరేషన్లు చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందట. బుంగమూతి కోసం ఆసక్తి చూపే యూత్ ఎక్కువైనట్లుగా గుర్తించారు.
ఇదెంత ఎక్కువగా ఉందంటే.. 2015 సంవత్సరంలో ప్రతి 19 నిమిషాలకు ఒక లిప్ సర్జరీ జరిగినట్లుగా అమెరికాలో చేపట్టిన తాజా సర్వే లెక్క బయటకొచ్చింది. అమెరికా వ్యాప్తంగా 27,449 మంది అపరేషన్లు చేయించుకున్నట్లుగా తేలింది. సెల్ఫీల్లో ఆకర్షణీయంగా కనిపించేందుకే ఈ బుంగమూతి సర్జరీలు చేయించుకుంటున్నట్లు లెక్క తేల్చారు.