Begin typing your search above and press return to search.

ట్రైన్‌ బోగీ పై నుంచి సెల్ఫీ .. దహనమై బూడిదగా మారిన విద్యార్థి !

By:  Tupaki Desk   |   17 Dec 2020 11:48 AM GMT
ట్రైన్‌ బోగీ పై నుంచి సెల్ఫీ .. దహనమై బూడిదగా మారిన విద్యార్థి  !
X
సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. తాజాగా ఈ సెల్ఫీల మోజులో పడి మరో విద్యార్థి ప్రాణాలు పోగుట్టుకున్నారు. రైలు బోగి పైకి ఎక్కి వెరైటీ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో భవిష్యత్, తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షల నడుమ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సెల్ఫీ కోసం ప్రయత్నించి నిండు ప్రాణం పోగొట్టుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఒడిషా రాష్ట్రంలోని గుణుపూర్ వెళ్లే పాసింజర్ రైలును కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేశారు రైల్వే అధికారులు. అలా ఆగి వున్న రైలును చూసే వారు కొందరైతే, మరికొంత మంది ఆ రైలు పైకి ఎక్కి సరదా పడేవారూ వున్నారు. అలా గత రాత్రి సరదాగా సెల్ఫీ కోసమై రైలుబోగి ఎక్కిన సూర్జి కుమార్ చేతులారా ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పై పర్లాకిమిడి రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

25వేల హైఓల్డేజ్‌ కరెంట్ వైర్లతోనే రైళ్లు నడుస్తాయి. రైలు పైకిక్కితే.. పొరపాటున అవి తగిలితే.. శరీరంలో ఏ భాగమూ చూడ్డానికి మిగలదు. ఇక్కడ అదే జరిగింది. ట్రైన్‌ పై నిలబడి సెల్ఫీ దిగబోయి కరెంట్ ‌షాక్‌ కు గురయ్యాడు కుమార్. నిండు నూరేళ్లు బ్రతకాల్సిన మనిషి ఉన్నఫళంగా కాలి బూదిడైయ్యాడు. ఎలక్ట్రిక్‌ ట్రైను బోగి ఎక్కి, సెల్‌ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ లైన్‌ను పట్టుకున్నాడు. బోగీలుపై కప్పి ఉన్న గోనె సంచులు తగులుకుని మంటలు చెలరేగి, బోగీలకు వ్యాపించాయి. దీంతో బాలుడు కూడా మంటల్లో చిక్కి, కాలిపోయాడు. అగి్నమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. కాబట్టి ఇకనైనా యువత యువత సెల్ఫీ పై ఉన్న పిచ్చి కాసింత తగ్గించుకుంటే మంచిది.