Begin typing your search above and press return to search.
పెళ్లి కావాలంటే టాయిలెట్ వద్ద సెల్ఫీ తప్పనిసరి
By: Tupaki Desk | 12 Oct 2019 12:02 PM GMTస్వచ్ఛత కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడు తన ఇంట్లోని మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగితేనే అతడికి పెళ్లి జరుగుతుంది. లేదంటే పెళ్లికి ద్వారాలు ముగిసిపోయేలా ఈ కొత్త పథకం ఉంది.
పెళ్లి చేసుకునే యువకులు అంతా తన ఇంట్లోని మరుగుదొడ్డి వద్ద దిగిన సెల్ఫీ ఫొటోను అధికారులకు పంపించాలి. అనంతరం అతడు పెళ్లి చేసుకునే అమ్మాయి తరుఫున సీఎం క్యారాలయానికి దరఖాస్తు చేయాలి. ముఖ్యమంత్రి కన్యా వివామ్ యోజన పథకానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫీ, దరఖాస్తును పరిశీలించి వారికి సర్కారు రూ.51వేలను ప్రభుత్వం కానుకగా అందజేస్తుంది.
పెళ్లైన మహిళలు వివాహం తర్వాత బహిర్భూమి కష్టాలు ఎదుర్కోకుండా ఉండేందుకే ఈ కొత్త పథకాన్ని మహారాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో మధ్యప్రదేశ్ సర్కారు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది.
ఇక ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెళ్లి సమయంలో రూ.51వేల ను మధ్యప్రదేశ్ సర్కారు అందిస్తోంది. అయితే ఇక నుంచి పురుషుడి ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే ఆ మొత్తాన్ని ఇచ్చేలా కొత్త పథకాన్ని మార్చింది.
అయితే మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ ఫొటోలు ఏంటని యువత సీరియస్ అవుతోంది. అధికారులు పరిశీలిస్తే సరిపోతుందని కదా అని విమర్శలు చేస్తున్నారు. ఇక ఏదో ఒక టాయిలెట్ వద్ద ఫొటో తీసి పంపిస్తే దుర్వినియోగం అవుతుంది కదా అని కూడా మండిపడుతున్నారు.