Begin typing your search above and press return to search.

కరోనా: సాయం చేస్తూ సెల్ఫీ తీసుకుంటే కేసు

By:  Tupaki Desk   |   12 April 2020 4:28 AM GMT
కరోనా: సాయం చేస్తూ సెల్ఫీ తీసుకుంటే కేసు
X
మాట్లాడే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. ఇప్పుడు దేశంలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. పేదలు - బిచ్చగాళ్లు - కూలీలు - రోడ్డుపక్కన నివాసం ఉండేవారు తిండిలేక అలమటిస్తున్నారు.

అయితే వారికి ఎంతో మంది నిస్వార్థంగా సాయం చేస్తున్నారు. బోజనాలు అందిస్తూ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే కొంత మంది దీన్ని పబ్లిసిటీకి కూడా వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది.

చేసే సాయం గోరంత ఉంటే... కొండంత సాయం చేస్తున్నట్టు బిల్డప్ లు ఇస్తూ సాయం చేస్తున్న వేళ సెల్పీలు తీసుకుంటున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి దాన కర్ణులుగా బిల్డప్ ఇస్తున్నారు.

ఇక కొంత మంది ఈ సాయం చేయడంలో నిబంధనలు పాటించడం లేదు. సోషల్ డిస్టేన్స్ పాటించకుండా ఇష్టానుసాయంగా పంచుతున్నారు. దీనివల్ల కరోనా ప్రబలే అవకాాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ కలెక్టర్ సెల్ఫీ రాయుళ్లకు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైతే రేషన్ - ఆహారం పంచుతూ సెల్ఫీలు - ఫొటోలు - వీడియోలు తీసుకుంటారో వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రచార రాయుళ్ల ఆగడాలకు తెరపడనుంది.