Begin typing your search above and press return to search.
ఓర్నీ.. హనీప్రీత్ చెప్పుకు ఇంత క్రేజా?
By: Tupaki Desk | 11 Oct 2017 6:59 AM GMTగడిచిన కొన్ని వారాలు అదే పనిగా వార్తల్లో నలుగుతున్న వారి జాబితాలో డేరాబాబా దత్తపుత్రికగా చెప్పే హనీప్రీత్ ప్రముఖంగా నిలుస్తారు. ఇద్దరు సాధ్వీలను లైంగికంగా హింసించిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు డేరాబాబా.కోర్టు తీర్పు చెప్పిన వెంటనే.. అతడ్ని తప్పించేందుకు భారీ కుట్రకు పాల్పడటంతో పాటు.. పెద్ద ఎత్తున హింస చెలరేగేలా చేసినట్లుగా హనీప్రీత్ మీద ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేయటం.. ఆమెను అరెస్ట్ చేయటానికి పోలీసుల పడిన తిప్పలు అన్నిఇన్ని కావు. దాదాపు ఐదువారాలు పోలీసులకు చిక్కకుండా అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆమెను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఆరురోజుల పాటు పోలీసులు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో ఆమె నుంచి కీలక సమాచారాన్ని సంపాదించాలని ఆశించిన పోలీసులకు నిరాశే మిగిలింది. ఎంతగా ప్రశ్నించినా.. సమాధానాలు చెప్పని హనీప్రీత్ తీరుతో పోలీసులకు చుక్కలు కనిపించాయి.
కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఆమెను రిమాండ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను ఎక్కువసేపు నిలబడలేనని.. ఆరోగ్యం బాగోలేదంటూ చేతులు జోడించి న్యాయమూర్తిని వేడుకున్న హనీప్రీత్ ను.. జైలుకు తరలించారు.
కోర్టు బయటకు వచ్చి పోలీసుల వ్యాన్ లోకి ఎక్కే సమయంలో చోటు చేసుకున్న హడావుడి అంతా ఇంతా కాదు. హనీప్రీత్ ఫోటోలు తీసుకునేందుకు మీడియా ప్రదర్శించిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇక.. ఆమెను అభిమానించే వారి హడావుడి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హడావుడి ఇలా సాగుతున్న వేళ.. ఒక మహిళ చెప్పు ఊడిపోయింది. పోలీసుల వాహనం ఎక్కి హనీప్రీత్ వెళ్లిన తర్వాత.. తెగిపోయిన చెప్పును చూసిన మీడియావారు.. ఆ చెప్పును ఫోటో తీసుకోవటం షురూ చేశారు. అదే సమయంలో హనీను అభిమానించే మరికొందరు చెప్పుతో సెల్ఫీ తీసుకొని తమ పైత్యాన్ని ప్రదర్శించారు. ఇలా కాసేపు హడావుడి జరిగిన తర్వాత.. అసలు విషయం బయటకు వచ్చింది. ఊడి పడి ఉన్న చెప్పు హనీప్రీత్‌ది కాదని.. ఎవరో మహిళదని తేలింది. ఏమైనా.. నిందితురాలిగా ఉన్న ఆమెకు మరీ ఇంత క్రేజా? మీడియా వాళ్లు మరీ ఇంత హడావుడి చేయాలా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.