Begin typing your search above and press return to search.
ట్రంప్ ని అభ్యర్ధిగా అయినా ఉంచుతారా?
By: Tupaki Desk | 12 Oct 2016 6:32 AM GMTప్రత్యర్ధులపైనో - శతృదేశాల నేతాలపైనో విమర్శలు చేస్తే పోనీలే రాజకీయం కదా అని సరిపెట్టుకుంటారు కానీ ఏకంగా సొంతపార్టీ నేతలపైనే విమర్శలకు దిగుతుంటే వారు మాత్రం ఏమిచేస్తారు? తాను తప్ప ఆ పార్టీలో అంతా చవటలే అనే స్థాయిలో మాట్లాడుతుంటే పక్కనెట్టే ఆలోచన చేయక ఏమి చేస్తారు? ఇవన్నీ చెబుతున్నది అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ గురించి. రోజురోజుకీ నోరు అదుపు - మాట పొదుపు అనే విషయం మరిచి విరుచుకుపడుతున్న ట్రంప్... తాజాగా సొంత పార్టీపైన కూడా తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీంతో అధ్యక్ష పదవి అభ్యర్ధిగా ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయని కథనాలు వస్తున్నాయి.
కుటిలమైన హిల్లరీ కంటే విధేయత లేని రిపబ్లికన్లే డేంజర్ అని మొదలుపెట్టిన ట్రంప్... రిపబ్లికన్లకు ఎలా గెలవాలో తెలియదని, గెలుపు అంటే ఎంటో వాళ్లకు తాను చూపిస్తానని చెలరేగిపోయారు. హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్ బలహీనుడని - ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని.. సెనేటర్ జాన్ మెక్ కెయ్ న్ కు మాట్లాడడం రాదని.. ఇలా వ్యక్తుల మీదా - పార్టీమీదా అదేపనిగా నోరు పారేసుకోవడంతో ట్రంప్ పై ఆ పార్టీ కారాలూ మిరియాలూ నూరుతుందట. పార్టీనీ - పార్టీ కీలక నేతలను ట్రంప్ తక్కువ చేసి మాట్లాడుతుండటంతో ఆయనను అధ్యక్ష పదవి అభ్యర్ధిగా కొనసాగనిస్తారా? మహిళల గురించి ట్రంప్ అసభ్యంగా మాట్లాడిన వీడియో బయటపడిన తర్వాత సొంతపార్టీ నేతలు సైతం ఆయన్ని దూరం పెడుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్ కొనసాగింపు సాధ్యమేనా? ఈ ప్రశ్నలు అన్నిచోట్లా వినిపిస్తున్నాయి!
ట్రంప్ రోజు రోజుకీ వివాదాస్పదం అవ్వడంతో - మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 30మందికి పైగా రిపబ్లికన్ గవర్నర్లు - నేతలు తీవ్రంగా పరిగణించారు. ఇదే క్రమంలో 331మంది సెనేటర్ల కలిగిన రిపబ్లికన్ పార్టీలో సగం మందికి పైగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించగా - వీరిలో 10శాతం మంది ట్రంప్ వెంటనే అధ్యక్షపదవి అభ్యర్ధి రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే... అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడవ్వడం సంగతి దేవుడెరుగు - అసలు వారి అభ్యర్ధిగానే ట్రంప్ ఉంటారా లేదా అనే అనుమానాలు మొదలైపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వాతావరణ ప్రత్యర్ధి పార్టీలో రావడం - హిల్లరీకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/