Begin typing your search above and press return to search.
పాక్ నటుల విషయంలో థాక్రేకు సవాల్!
By: Tupaki Desk | 24 Sep 2016 7:07 AM GMTయురి ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ ల మధ్య పరిస్థితి హాట్ హాట్ గా ఉంటే.. మరో వైపు ఇండియాలో రాజకీయ నాయకుల మధ్య ఈ విషయంపై హాట్ హాట్ మాటలు దొర్లుతున్నాయి. ఈ విషయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ కలకలం రేపుతుంది. భారత్ పై ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలి అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మరింత ఘాటుగా స్పందించింది. ఎంఎన్ ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు ఘాటైన సవాలు విసిరింది.
ఇండియాలో ఉన్న పాకిస్థాన్ నటులపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన వ్యాఖ్యల అనంతరం ఎస్పీ ఎమ్మెల్యే అబు అజ్మీ రాజ్ థాక్రేకు సవాల్ విసిరారు. దేశానికి వీసాలతో చట్టబద్ధంగా వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేయడం, మాటలతో భయపెట్టడం కాదని.. దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ మన దేశానికి ఆత్మాహుతి బృందాలను పంపుతుంది కాబట్టి.. మీకు కూడా దమ్ముంటే - దెబ్బకు దెబ్బ తీయాలని అనిపిస్తే, దేశంపై ప్రేమ ఉంటే మీరు కూడా మీ ఆత్మాహుతి బాంబర్లను లాహోర్ - కరాచీలకు పంపండి. అంతే కానీ... అధికారికంగా ఇండియా వచ్చిన వారిపై మీ ప్రతాపం చూపించాలని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని రాజ్ థాక్రేకు అబు అజ్మీ సూచించారు.
అక్కడితో ఆగని అజ్మీ... పాకిస్థాన్ దాకా ఎందుకు? గడ్చిరోలి - చంద్రాపూర్ లో నక్సల్స్ పోలీసులపై దాడులకు దిగుతున్నారు. కనీసం అక్కడికైనా మీ కార్యకర్తలను పంపించి భద్రతా దళాలను రక్షించండి అని ఘాటుగా స్పందించారు. కేవలం సంచలన వ్యాఖ్యలు చేయడం, ఓటు బ్యాంకు రాజకీయాల స్టేట్ మెంట్స్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని.. కనీసం నక్సల్స్ విషయంలో అయినా మీరు ఏదైనా పనిచేస్తే... అప్పుడు మీరు దేశం కోసం పాకులాడుతున్నట్టు తాను అర్థం చేసుకుంటానంటే అజ్మి విరుచుకుపడ్డారు.
ఇదే క్రమంలో బాలీవుడ్ లో ఉన్న పాకిస్థాన్ నటులపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన వ్యాఖ్యల అనంతరం.. ప్రముఖ దర్శకులు విక్రమ్ భట్, హన్సల్ మెహతా థాక్రేకు కొన్ని సూచనలు చేశారు. కళాకారులను - క్రికెటర్లను టార్గెట్ చేయడం సరికాదని... అసలు జరుగుతున్న దాడులకు, కళాకారులకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, థాక్రే మాటలపై స్పందించిన పోలీస్ అధికారులు... అలాంటి మాటలు మానుకోవాలని, భారతదేశం అనుమతితో ఇండియాలో ఉన్న పాకిస్థానీలకు తమ రక్షణ తప్పక ఉంటుందని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/