Begin typing your search above and press return to search.
రజినీ - కమల్ లపై విరుచుకుపడ్డ ఆ నటుడు
By: Tupaki Desk | 11 April 2018 11:00 AM GMTదక్షిణాదిన వివిధ భాషల్లో నటించి గొప్ప పేరు సంపాదించిన కన్నడ నటుడు అనంత్ నాగ్. కన్నడ సినీ పరిశ్రమలో ఆయన్ని లెజెండ్ గా గుర్తిస్తారు. ఆయన తమిళ సూపర్ స్టార్లు రజినీకాంత్.. కమల్ హాసన్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కావేరీ జల వివాదానికి సంబంధించి రజినీకాంత్.. కమల్ హాసన్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఆయనన్నారు. ఈ వివాదాన్ని ప్రతి తమిళ నాయకుడూ రాజకీయ పరంగా ఉపయోగించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడని.. ఐతే రజినీ.. కమల్ వారికి భిన్నంగా వ్యవహరిస్తారని.. పరిణతి ప్రదర్శిస్తారని.. ఉన్నతంగా ఆలోచిస్తారని తాను ఆశించి భంగపడ్డానని అనంత్ నాగ్ అన్నారు.
యువ కథానాయకుడు శింబు కావేరీ జలాల్ని తమిళనాడుకు ఎంత కేటాయిస్తారో అదే స్థాయిలో కర్ణాటకకూ ఇవ్వాలని అన్నాడని.. అతడికి ఉన్న పరిణతి కూడా రజినీ-కమల్ లకు లేకపోయిందని అనంత్ నాగ్ అన్నాడు. కావేరీ జల వివాదం 130 ఏళ్లకు పైగా నడుస్తోందని.. దీనికి ఎప్పుడు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. తనకు తమిళ ప్రజల పట్ల ఎలాంటి కోపం లేదని.. వాళ్లు చాలా మంచి వాళ్లని.. కన్నడిగులతో స్నేహంగా ఉంటారని.. కానీ రాజకీయ నాయకులే తమ ప్రయోజనాల కోసం కావేరీ జల వివాదాన్ని పెద్దది చేస్తున్నారని.. ప్రజల్ని రెచ్చగొడుతున్నారని అనంత్ నాగ్ అన్నారు. రజినీ.. కమల్ ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తారని అనుకున్నానని.. కానీ వాళ్లు కూడా సగటు రాజకీయ నాయకుల్లాగే వ్యవహరిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు కూడా వీళ్లు ఎదురు చూడకపోవడం శోచనీయమన్నారు.