Begin typing your search above and press return to search.

భారత్ అంటే లెక్కలేదా? యాపిల్ సంస్థపై సీనియర్ యాక్టర్ ఫైర్

By:  Tupaki Desk   |   17 Sep 2021 9:30 AM GMT
భారత్ అంటే లెక్కలేదా? యాపిల్ సంస్థపై సీనియర్ యాక్టర్ ఫైర్
X
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రపంచవ్యాప్తంగా బోలెడు క్రేజ్ ఉంది. ఆ సంస్థ నుంచి విడుదలయ్యే యాపిల్ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గిరాకీ ఉంది. ఇయ యాపిల్ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజ్ ఉంది. పైగా ఈ ప్రోడక్టుల కొనుగోళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. తాజాగా యాపిల్ ఫోన్ విడుదల కార్యక్రమాన్ని భారత్ నుంచే ఎక్కువమంది వీక్షించడం విశేషం.

అయితే ఇంతగా భారత వినియోగదారులు యాపిల్ ఫోన్లను ఆదరిస్తున్న కూడా ఆ సంస్థ భారత్ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందని తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ విమర్శించారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు.

న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్ ను తాజాగా అనుపమ్ ఖేర్ సందర్శించారట.. అక్కడి ఒలింపిక్స్ కలెక్షన్ పేరుతో కొన్ని స్మార్ట్ వాచీలను డిస్ ప్లే లో ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత జెండా కనిపించకపోయే సరికి ఆయన నిరాశ చెందారు. అక్కడ వాచీలను వీడియో తీసి ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

స్మార్ట్ వాచీ కలెక్షన్ బాగుంది. కెనెడా, ఆస్త్రేలియా, ఫ్రాన్స్.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్ ఉంచారు. కానీ అందులో భారత్ జెండా మాత్రం కనిపించలేదు. మన జెండా లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్లు చెప్పుకొచ్చారు.

యాపిల్ ఉత్పత్తులు ఉపయోగించేవాళ్లు అధికంగా భారత్ లోనే ఉన్నారు కదా.. మరి మా జెండా కనిపించలేదా? అని అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు. అయితే అనుపమ్ ఖేర్ ప్రశ్నలపై యాపిల్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ..