Begin typing your search above and press return to search.
రూ.10 నోటుతో సినీనటి నగలు కొట్టేశారే
By: Tupaki Desk | 14 April 2016 5:09 AM GMTఅలనాటి హీరోయిన్ కు అనుకోని షాక్ తగిలింది. రూ.10 నోటుతో దృష్టి మరిల్చేలా చేసి విలువైన బంగారు నగల్ని దోచేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. బాధితురాలు అలనాటి ప్రముఖ హీరోయిన్ రాజశ్రీ కావటం గమనార్హం. పక్కా వ్యూహంతో తాజా దోపిడీ జరిగిందని తెలుస్తోంది. అలనాటి మేటి నటి.. తెలుగు.. తమిళ సినిమా రంగాలకు సుపరిచితురాలైన 75 ఏళ్ల రాజశ్రీ తన కుమారుడితో కలసి చెన్నైలోని టీ నగర్.. పనక్కల్ పార్క్ సమీపంలోని బ్యాంకుకు వెళ్లారు. లాకర్ లోపెట్టిన బంగారు నగల్ని తీసుకొని బయటకు వచ్చారు.
అనంతరం కారులో కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి.. పది రూపాయిల నోటు కిందపడిందని.. ఇది మీదేనా? అని అనడగటం.. ఆమెకు అర్థం కాక కారు దిగినంతనే.. మరోవైపు నుంచి కారులోని బంగారు నగల సంచిని పట్టుకొని ఉడాయించటంతో నాటి హీరోయిన్ బిత్తరపోయారు. చోరీకి గురైన బ్యాగులో రూ.15లక్షల వరకూ బంగారు నగలున్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతంపై చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.