Begin typing your search above and press return to search.
పెదకూరపాడా.. గుంటూరా? బీజేపీ సీనియర్ నేత తర్జన భర్జన
By: Tupaki Desk | 25 July 2022 3:51 AM GMTబీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ బెంగ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆయనకు తర్జన భర్జనగా మారింది. గతంలో పెదకూర పాడు నియోజ కవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న ఆయన.. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో పోటీకి దూ రంగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి.. ఆ పార్టీ టికెట్‌పై గుంటూరు ఎంపీగా బరిలో నిలబడ్డారు. అయితే.. త్రిముఖ పోటీలో ఓడిపోయారు.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయం ఆసక్తిగా మారింది. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని.. కన్నా అనుచరులు కోరుతున్నారు. అయితే.. జనసేనతో బీజేపీకి పొత్తు ఉన్న నేపథ్యంలో ఈటికెట్‌ను ఆ పార్టీనే కోరుతున్నట్టు చర్చ సాగుతోంది.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన తరఫున పుట్టి సామ్రాజ్యం పోటీ చేశారు. అయితే.. ఆమెకు కేవలం 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయారు.
అయినప్పటికీ.. ఇక్కడ జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెదకూర పాడు కాకుండా.. మళ్లీ గుంటూరు నుంచే పోటీ చేయాలని.. కన్నాకు సోము వీర్రాజు ఇటీవల సూచించారని.. పార్టీలో గుసగు స వినిపిస్తోంది. దీనికి కన్నా.. విముఖత వ్యక్తం చేశారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు తనకు ఇవ్వాలని.. తను అయితేనే గెలుస్తానని.. కన్నా.. స్పష్టం చేశారట. కానీ, జనసేన కూడా అదే టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో కన్నా.. పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది.
అయితే.. కన్నా అసలు పార్టీలోనే ఉండరని.. వచ్చే ఎన్నికల నాటికితన కు పెదకూర పాడు టికెట్ ఇచ్చే ఆలోచన లేదని తెలిసిన తర్వాత.. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని.. అడపా దడపా తప్ప.. పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. గతంలో ఉన్న జోష్ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కన్నా.. అసలు ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది.