Begin typing your search above and press return to search.
గాంధీ భవన్ కు వాస్తు దోషం?
By: Tupaki Desk | 4 Jan 2019 1:38 PM GMTకాంగ్రెస్ అంటే హస్తం గుర్తు - గాంధీ భవన్ గుర్తొస్తాయి. కానీ.. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కొన్నాళ్లుగా బోసిపోతోంది. అక్కడికి నాయకులెవరూ రావడం లేదు. పార్టీ సీనియర్లయితే గాంధీ భవన్ ముఖమే చూడడం లేదు. ఏదైనా పార్టీ కార్యక్రమాలు - సమావేశాలు - ప్రెస్ మీట్లు ఉన్నా కూడా వాటికి గాంధీ భవన్ ను వేదిక చేసుకోవడం లేదు. దీనికి కారణం గాంధీ భవన్ కు వాస్తు దోషం ఉందని కాంగ్రెస్ నేతలు నమ్ముతుండడమేనని తెలుస్తోంది. వాస్తు దోషం కారణంగానే కాంగ్రెస్ పార్టీ లేవలేకపోతోందని అనుకుంటున్నారు. గాంధీ భవన్ వాస్తు దోషం కారణంగానే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి పాలైందని కూడా ఆ పార్టీ నేతల్లో చాలామంది భావిస్తున్నారట.
ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ నేతల్లో చాలామందికి గాంధీ భవన్ పట్ల ఇలాంటి భావన ఉన్నప్పటికీ అంత సీరియస్‌గా ఎవరూ తీసుకోలేదు. కానీ - మొన్నటి తెలంగాణ ఎన్నికల తరువాత చాలామంది దీన్ని బలంగా నమ్ముతున్నారట ఇప్పుడు. గాంధీ భవన్ వాస్తు దోషమే పార్టీకి ఎంత అనుకూలత ఉన్నా కూడా ఫలితాలు భిన్నంగా వచ్చాయన్న మాట కాంగ్రెస్ లో వినిపిస్తోంది.
ఇది ఎంతవరకు వచ్చిందంటే... ఈ అనుమానంతో కాంగ్రెస్ నేతలెవరూ అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదట. గాంధీ భవన్ కు సమీపంలోని హోటళ్లలో కానీ - సిటీలోని ఇతర హోటళ్లలో కానీ ప్రెస్ మీట్లు పెడుతున్నారట. దీంతో క్రమంగా గాంధీ భవన్ ఒక భూత్ బంగ్లాలా మారిపోవడం ఖాయమని వినిపిస్తోంది. టీఆరెస్ - టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయానికి సింపుల్ గా వాస్తు సవరణలు చేసుకునే వీలు లేకపోవచ్చు. అందుకు అధిష్ఠానం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. కానీ... అధిష్ఠానం పెద్దలకు ఈ వాస్తు - పూజలు - హిందూ నమ్మకాలపై నమ్మకం లేకపోవచ్చు కూడా .అందుకే.. టీ కాంగ్రెస్ నేతలు అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా హోటళ్లలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారట.