Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: ఏపీ సీఎం కార్యాలయానికి తాకిన కరోనా?
By: Tupaki Desk | 27 Jun 2020 4:00 PM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తోంది. రోజుకు 1000 కి దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే 10వేల కేసులు దాటిపోయాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కూడా కరోనా వచ్చేసింది. ఇప్పటికే హైకోర్టు, సచివాలయంలో పలువురు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం జగన్ కార్యాలయంలోకి (సీఎంవో) కూడా కరోనా అడుగుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన తోటి ఐఏఎస్ లకు తెలియజేశారని ఆ వార్త ఆనోట ఈనోట మీడియాకు లీక్ అయ్యింది.
అంతేకాదు.. ఆ సీఎంవోలో పనిచేసే ఐఏఎస్ తోపాటు సీఎంవోలోనే ఉన్న మరో ముగ్గురు ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డట్టు చెబుతున్నారు. దీంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారట.. ప్రస్తుతం వీరితో సన్నిహితంగా ఉన్న వారు క్వారంటైన్ కు వెళ్లిపోయారని తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఇంతవరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.
సీఎంవోలో ఒక ఐఏఎస్, మరో ముగ్గురికి కరోనా అని తెలియడంతో సీఎం జగన్ వరకు కరోనా సెగ వచ్చినట్టైంది. సీఎంవోలోని మిగతా వారికి కూడా పరీక్షలు చేస్తే ఇంకా ఎంతమందికి బయటపడుతుందోనని ఆందోళన మొదలైంది. సీఎంవోలోని నలుగురికి కరోనాపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.