Begin typing your search above and press return to search.
ఈ ఐఏఎస్.. అందరికీ ఆదర్శనీయుడయ్యారు
By: Tupaki Desk | 16 March 2020 4:22 PM GMTప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే వేల మందిని పొట్టనబెట్టుకోగా... లక్షలాది మందిని ఐసోలేషన్ వార్డులకు పంపేసింది. అయితే ఈ వైరస్ బారినపడ్డ కొందరు రోగులు... ఐసోలేషన్ లో ఉండలేక వైద్యుల కళ్లుగప్పి పరారవుతున్నారు. కొందరైతే విదేశాలకు వెళ్లివచ్చినా... ఎక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుందనో - లేదంటే ఐసోలేషన్ కు వెళ్లాల్సి వస్తుందనో... అసలు తమ ఫారిన్ ట్రిప్ గురించి ఇతరులకు చెప్పకుండా దాస్తున్నారు. ఇలాంటివారికి భిన్నంగా విదేశాలకు వెళ్లి వచ్చిన తనకు ఏమైనా కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో ఎవరూ పిలవకుండానే వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటుగా ఏకంగా ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంటున్న ఓ ఐఏఎస్ అధికారి ఉదంతం ఇది. సమాజం శ్రేయస్తు కోరే ఇలాంటి అధికారులు... ఇతరులకు నిజంగానే ఆదర్శనీయులే కదా. మరి ఈ ఐఏఎస్ ఎవరు? ఆయన అనుభవం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గుర్తున్నారు కదా. ఐఏఎస్ అధికారుల్లో సీనియర్ అయిన ఈయన ఉమ్మడి ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అనివార్యంగా ఇటీవలే ఫారిన్ టూర్ వెళ్లి వచ్చారట. తన ఫారిన్ ట్రిప్ ముగిసి హైదరాబాద్ చేరుకున్న వెంటనే అరవింద్ కుమార్ నేరుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆసుపత్రికి వెళ్లి... తనకు కరోనా వైరస్ సోకిందా? అని పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారట. అయితే పరీక్షల్లో అరవింద్ కుమార్ కు కరోనా సోకలేదని తేలిపోయిందట. అయినా కానీ... ప్రస్తుతం తాను ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంటున్నట్లుగా అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సాధారణంగా విదేశాలకు వెళ్లి వచ్చే వారు 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి కదా. ఆ మేరకే తాను ఐసోలేషన్ ఉంటున్నానని అరవింద్ కుమార్ తెలిపారు.
ఈ ఉదంతంపై అరవింద్ కుమార్ ఏమంటున్నారన్న విషయానికి వస్తే... ‘‘నాకు ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరం లేవు. నాకు నేనే స్వయంగా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్-19తో పాటు అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఎందుకంటే ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాను. అందుకే ప్రభుత్వ నిబంధనలు అన్ని పాటిస్తూ వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉన్నాను’’ అని అరవింద్ కుమార్ తన వైద్య పరీక్షలు, స్వీయ ఐసోలేషన్ పై వివరణ ఇచ్చారు. మొత్తంగా కరోనా వైరస్ అంటే అంతా హడలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ సీనియర్ ఐఏఎస్ అదికారి హోదాలో విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత బాధ్యత కలిగిన పౌరుడిగా తనకు తాను ముందు జాగ్రత్తగా వైదయ పరీక్షలు చేయించుకోవడంతో పాటుగా స్వీయ ఐసోలేషన్ లో ఉంటున్న అరవింద్ కుమార్ ను అబినందించక తప్పదు.