Begin typing your search above and press return to search.

బాబు బ్యాచ్ అస్త్రసన్యాసం.. ఓటమేనా?

By:  Tupaki Desk   |   8 May 2019 11:07 AM GMT
బాబు బ్యాచ్ అస్త్రసన్యాసం.. ఓటమేనా?
X
వైఎస్ జగన్ ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నారన్న అంచనాలకు బలం చేకూరే సంఘటనలు తాజాగా చోటుచేసుకున్నాయి. చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్ గా పేర్కొనే ఇద్దరు సీనియర్ అధికారులు సెలవులపై వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు - విశ్వాసపాత్రులైన ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర - ఐపీఎస్ అధికారి అయిన మాజీ నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. నిఘా విభాగం చీఫ్ గా ఉండి ఎన్నికల వేళ చంద్రబాబుకు బాగా సహకరించారు వెంకటేశ్వరరావు.. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఆయనను బదిలీ చేసింది. ఆ తర్వాత చంద్రబాబును వెంకటేశ్వరరావును ఏసీబీ చీఫ్ గా నియమించారు.

ఇక చంద్రబాబు ఎన్నికల వ్యూహాల్లో భాగస్వామి అయి కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ సీనియర్ అధికారి సతీష్ చంద్ర కూడా పోలింగ్ ముగిశాక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. వీరిద్దరూ ఇలా అస్త్ర సన్యాసం చేయడం వైసీపీ గెలుపుపై అంచనాలకు బలం చేకూరుతోంది.

ఇక చంద్రబాబుకు అండగా మొన్నటి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన తనయుడు లోకేష్ బాబు కూడా కంటికి కనిపించడం లేదు. లోకేష్ విదేశాలకు వెళ్లాడని కొంతమంది అంటున్నారు. మంగళగిరిలో పోలింగ్ ముగిశాక లోకేష్ బాబు పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గానికి తొంగి చూడలేదట.. ప్రత్యర్థి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలతో ఉండి ఇదే ఆరోపిస్తున్నారు.

ఇలా అందరూ ప్రస్తుతం వదిలేసి వెళ్లడంతో చంద్రబాబు ఒంటరి అయ్యారు. ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు కానీ.. అందరూ బాబుకు దూరంగా ఉండడం.. ఏదో జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరే విధంగానే ఉంది.