Begin typing your search above and press return to search.
కొరగాని మేధావులు.. ఎవరికీ అవసరం లేదా?
By: Tupaki Desk | 27 Aug 2022 4:30 PM GMTరాష్ట్రంలో మేధావి వర్గం బాగానే ఉంది. రిటైర్డ్ ఐఏఎస్‌లు... ఐపీఎస్‌లు చాలా మంది ఉన్నారు. గతంలో వీరు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. కొంత మంది టీడీపీలోను.. చాలా చాలా తక్కువ మంది వైసీపీలోను చేరారు. ఇంకొందరు జనసేన తీర్థం కూడా పుచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు ఎటు వైపు చూస్తున్నారు? అనేది రాజకీయంగా చర్చకు వస్తోంది. ప్రస్తుతం మేధావులుగా ఉన్న వారు సైలెంట్‌గా ఉన్నారు. కాదుకాదు.. వారినే పార్టీలు అసలు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటివారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన టికెట్‌పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయన ఓటమి తర్వా త.. కొన్ని రోజులు యాక్టివ్‌గానే ఉన్నా.. తర్వాత.. జనసేనను వీడారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ, అటు వైసీపీ ఆయనను పిలిచింది లేదు. ఈ యన వెళ్లింది కూడా లేదు. ఇదిలావుంటే, ఇటీవల ఒక మాజీ ఐఏఎస్ అధికారి జనసేనలో చేరారు.
ఆయన ద్వారా.. ఒకరిద్దరిని తీసుకువచ్చేందుకు జనసేన వర్గాలు ప్రయత్నించాయనే టాక్ ఉంది. అయితే.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మాస్ నాయకుల కోలాహలం ఎక్కువగా ఉంది. దీంతో సీనియర్ ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లు ముందుకు రావడం లేదు. వచ్చినా.. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పార్టీలు కూడా దూరం పెడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఉదాహరణకు ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. వైసీపీ తరఫున పోటీ చేసి.. ఎంపీ అయ్యారు. అదే ఒక ఐపీఎస్ జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీనికి కారణం.. మాస్ అప్పియరన్సే.. అనేది టాక్.
ఈ మాస్ అప్పియరెన్స్.. రావాలంటే.. జనాల మధ్య ఉండాలి. కానీ, వీరు ఉండడం లేదు. ఉన్నా.. రావడం లేదు. ఈ క్రమంలో మేధావులను చేర్చుకునేందుకు ఒక్క జనసేన తప్ప..ఇతర పార్టీలు మొగ్గు చూపడం లేదు. చూపినా.. వారికి కీలకమైన టికెట్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడుతున్న పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో.. మేధావి వర్గానికి ఎవరు అవకాశం ఇస్తారు? అనేది చర్చకు దారితీస్తోంది. టీడీపీకి కానీ.. వైసీపీకి కానీ.. ఎక్కడా ఖాళీ లేనంతగా.. నాయకులు ఉన్నారు. ఉన్నవారి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు.. కొత్తవారు వచ్చినా.. వారిని చేర్చుకుని టికెట్ ఇచ్చే సాహసం అయితే చేయలేరు. ఇక, ఉన్నదల్లా జనసేన ఆప్షన్ ఒక్కటే. కానీ, ఈ పార్టీలో నిలకడైన రాజకీయం చేయడం లేదేనే టాక్ వినిపిస్తున్న దరిమిలా... మేధావుల రాజకీయం ప్రశ్నగా మారింది.