Begin typing your search above and press return to search.
జగన్ కోరికను నెరవేర్చని కేంద్రం
By: Tupaki Desk | 4 Sep 2019 4:45 AM GMTఏపీ సీఎంగా వైఎస్ జగన్ గద్దెనెక్కగానే తన టీంను రెడీ చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుకు తెలంగాణ కేడర్ లో ఉన్న హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసుకున్నాడు. ఈయన గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ భద్రతా వ్యవహారాలు చూసుకునేవారు. అందుకే జగన్ ఏరికోరి కేసీఆర్ తో మాట్లాడి ఒప్పించి మరీ స్టీఫెన్ ను ఏపికి రప్పించారు.
గత మేనెలలో తెలంగాణలో సెలవు పెట్టిన స్టీఫెన్ రవీంద్ర ఏపీలో అనధికారికంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు బదిలీ చేయాలంటూ కేంద్రంలోని డీఓపీటీకి దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా డీఓపీటీ స్టీఫెన్ రవీంద్ర దరఖాస్తును తోసిపుచ్చింది. ఏపీ కేడర్ కు మారేందుకు కేంద్రం అంగీకరించలేదు.
దీంతో స్టీఫెన్ రవీంద్ర తిరిగి పోస్టింగ్ కోసం తాజాగా మంగళవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాడు. జగన్ కోరినా.. కేసీఆర్ ఒప్పుకొని పంపిస్తానని చూసినా కేంద్రం మాత్రం స్టిక్ట్ ఆఫీసర్ అయిన స్టీఫెన్ రవీంద్రను జగన్ ప్రభుత్వానికి అప్పగించకుండా మోకాలడ్డడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.