Begin typing your search above and press return to search.

పాల్ ఓ పిచ్చి కుక్క శ్వేతా రెడ్డి

By:  Tupaki Desk   |   17 Feb 2019 3:46 PM GMT
పాల్ ఓ పిచ్చి కుక్క శ్వేతా రెడ్డి
X
ఏపీ పాలిటిక్స్‌ లో క్రైస్తవ మత ప్రభోధకుడు కేఏ పాల్‌ కమెడీయన్‌ అయిపోయారు. ఆయన కామెడీని అందరూ ఎంజాయ్‌ చేస్తుంటే.. కేఏ పాల్‌ పై సీరియస్‌ అవుతోంది సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్వేతా రెడ్డి. మొదట శ్వేతారెడ్డికి హిందుపూర్‌ టిక్కెట్‌ ఇస్తానని చెప్పిన కేఏపాల్‌ ఆ తర్వాత హ్యాండ్‌ ఇచ్చాడు. దీంతో.. హర్ట్‌ అయిన శ్వేతా.. పాల్‌ పై ఓ రేంజ్‌ లో విరుచుకుపడింది. ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ విమర్శించింది. అయితే... నిన్నటికి నిన్న ఒక చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేఏ పాల్‌ శ్వేతారెడ్డిపై కొన్ని అనకూడని కామెంట్స్‌ చేశాడు. శ్వేతారెడ్డి జగన్‌, పవన్‌, చంద్రబాబు కోవర్ట్‌ అని, అన్నింటికి మించి ఆమె మద్దెలచెర్వు సూరి గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ వ్యక్తిగతంగా ఆరోపణలు చేశాడు. దీంతో.. శ్వేతారెడ్డి రెచ్చిపోయింది. కేఏ పాల్‌ ని ఓ రేంజ్‌లో ఆడుకుంది.

"కేఏ పాల్‌ కు పిచ్చిపట్టినట్లుంది. వెంటనే అతడ్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చెయ్యాలి. ఆయన పిచ్చి రోజురోజుకి ముదిరిపోతుంది. ప్రస్తుతం విచిత్రంగా మాట్లాడుతున్న ఆయన.. కొన్నాళ్ల తర్వాత కరవడం మొదలుపెడతారు. పైసా లేకపోయినా.. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఉన్నానంటూ బిల్డప్‌ ఇచ్చే నువ్వే నన్ను విమర్శించేంది.? కేవలం డబ్బుల కోసం ప్రజాశాంతి పార్టీ పెట్టిన నువ్వు.. నలుగుర్ని వెంటేసుకుని చందాలు వసూలు చేస్తున్నావు. నువ్వు నన్ను విమర్శిస్తావా? నేను జగన్‌, చంద్రబాబు, పవన్‌ కోవర్టునా.? ఒక్కసీటు కూడా గెలవలేని నువ్వా నన్ను విమర్శించేంది.? నీకు డబ్బులు కావాలంటే రోడ్డుమీదకు వెళ్లి అడుక్కో. తలా ఒక రూపాయి వేస్తారు. ఏమన్నావ్‌..? నేను కోవర్టునా.? నువ్వు చూశావా.? ఏంటి నేను మద్దెలచెర్వు సూరి గర్ల్‌ ఫ్రెండ్‌ నా? ఏం మాట్లాడుతున్నావ్‌.? హౌ డేర్‌ యు టు టాక్ లై దట్‌? సూరి కేసులో ఏ1 ఒక్కడికే శిక్ష పడింది. మిగిలిన వాళ్లంతా నిర్దోషులు అని కోర్టు తీర్పు చెప్పింది. నువ్వా నన్ను విమర్శించేది. సీనియర్‌ జర్నలిస్ట్‌ గా నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. ప్రముఖులతో మాట్లాడాను. కానీ నీలాంటి నీతి తక్కువ వాడిని మాత్రం క్కడా చూడలేదు. నా కేరక్టర్‌ ని అవమానపరుస్తున్నావా. ఎంత ధైర్యం నీకూ" అంటూ ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది శ్వేతారెడ్డి. మరి శ్వేతా రెడ్డి కౌంటర్స్‌ కు కేఏ పాల్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.