Begin typing your search above and press return to search.

టాప్ చానెల్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఔట్.. 50 లక్షలే కారణమా?

By:  Tupaki Desk   |   24 March 2021 6:39 AM GMT
టాప్ చానెల్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఔట్.. 50 లక్షలే కారణమా?
X
తెలుగులోనే అది ఓ దమ్మున్న చానెల్ గా పేరుంది. దానితో పెట్టుకోవడానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా బయటపడుతుంటారు. ఆ సంస్థ ఎండీతోపాటు అందులోని జర్నలిస్టులకు దూకుడు ఎక్కువనే. ప్రభుత్వాలతోనే సై అంటే సై అని ఢీకొంటారు. అయితే కొన్ని నెలల కిందటే ఆ చానెల్ లో చేరిన ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు తాజాగా ఆ సంస్థ నుంచి ఎగ్జిట్ కావడం జర్నలిస్ట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన వ్యవహారం తెలిసి సదురు చానెల్ యాజమాన్యం తీసేసిందన్న టాక్ నడుస్తోంది.ఈ మేరకు సోషల్ మీడియా ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇటీవలే ఓ బీజేపీ నేతపై దాడి విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు ఇప్పుడు సదురు చానెల్ నుంచి నిష్క్రమించాడట.. ఈ మేరకు వారం రోజులు సెలవు పెట్టాడని మొదట చెప్పాడట.. అయితే అది సెలవు కాదని.. శాశ్వత తొలగింపు అని తాజాగా క్లారిటీ వచ్చిందట..

సాయంత్రానికి సోషల్ మీడియాలో కొంత మంది అసలు విషయం ఇదీ అని కొందరు బయటపెట్టారు. రూ.50 లక్షల బ్లాక్ మెయిలింగ్ చేసి దొరికిపోయాడని.. ఆ చానెల్ యాజమాన్యానికి తెలిసి తొలగించిందన్న ప్రచారం ఉధృతమైంది. ఆయనకు కులం అంటగట్టి.. ఆయనంటే పడని వారు సోషల్ మీడియాలో ఈ మేరకు హోరెత్తిస్తున్నారు.

ఇదంతా నిజమా? కాదా? అన్న డైలామా జర్నలిస్టు సర్కిల్స్ లో సాగింది. దీనిపై ఎట్టకేలకు సదురు ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ మేరకు స్పందించాడు. ‘ప్రస్తుతానికి సెలవు మాత్రమేనని.. తనపై ఏదేదో ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని’ మండిపడ్డారు.

అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ఆయనకు ఇచ్చిన చానెల్ ఫోన్ నంబర్లను తక్షణం నిలిపివేయించారని.. దాదాపుగా ఆయనను చానెల్ దూరం పెట్టినట్టు టాక్. అయితే ఇదంతా ప్రచారం మాత్రమే. దీనిపై అసలు నిజాలు త్వరలోనే బయటపడుతాయి. అంతవరకు ఇదొక గాసిప్ లాగానే భావించాల్సి ఉంటుంది.