Begin typing your search above and press return to search.

వైసీపీలో ర్యాగింగ్.. కొత్త తలనొప్పులు

By:  Tupaki Desk   |   4 Aug 2019 12:24 PM GMT
వైసీపీలో ర్యాగింగ్.. కొత్త తలనొప్పులు
X
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - ఆర్కే రోజా - ఆనం రాంనారాయణ రెడ్డి - భూమన కరుణాకర్ రెడ్డి.. ఇలా ఒక్కటేమిటీ వైసీపీ గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు బోలెడుమంది ఉన్నారు. వీరిలో చాలా మంది నాడు వైఎస్ కేబినెట్ లో కూడా పనిచేసిన వారే.. కీలకంగా వ్యవహరించిన వారే. అంతటి ఉద్దండ పిండాలకు జగన్ కేబినెట్ లో సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవులను ఇవ్వలేకపోయారు. ఆశ్చర్యకరంగా కొత్తగా గెలిచినవారు.. కనీసం ముఖం కూడా తెలియని జూనియర్లకు సామాజిక కోణంలో జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. వారిని అందలం ఎక్కించారు.

అయితే మంత్రులుగా ఆయా జిల్లాలకు వాళ్లే బాసులు. వారి కనుసన్నల్లోనే అంతా జరగాలి. కానీ వైసీపీలో ఇక్కడే ట్రెయిన్ రివర్స్ అవుతోందట. జూనియర్ మంత్రిని సీనియర్ ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదనే చర్చ వైసీపీలో జరుగుతోంది. ఎక్కడైనా వేలు పెట్టుకో నా నియోజకవర్గంలో మాత్రం వేలు పెడితే ఊరుకోం అంటూ మంత్రులనే సీనియర్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారట..

ఇప్పుడు వైసీపీలో జూనియర్ మంత్రులను సీనియర్ ఎమ్మెల్యేలు ర్యాగింగ్ చేస్తున్నారన్న ప్రచారం వైసీపీలో విస్తృతంగా సాగుతోంది. రెండున్నరేళ్ల తర్వాత తాము అవుతాం మంత్రులం.. సో ఒళ్లు దగ్గర పెట్టుకో అని జూనియర్ మంత్రులకు సీనియర్ ఎమ్మెల్యేలు హెచ్చరికలు పంపుతున్నారు.

ఇక పార్టీలో ఉన్న సీనియర్లను ఎదురించలేక జూనియర్ మంత్రులు కూడా సైలెంట్ అయిపోతున్నారు. తుమ్మితే ఊడిపోయే మంత్రి పదవుల కోసం ఎందుకొచ్చిన గొడవ అని సర్ధుకుపోతున్నారట.. రెండున్నరేళ్ల తర్వాత సీనియర్ ఎమ్మెల్యే మంత్రి అయితే తమకు కష్టకాలమేనని అంతా గప్ చుప్ గా ఉంటున్నారట.

ఇప్పుడు వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేల ర్యాగింగ్ ను జూనియర్ మంత్రులు తట్టుకోలేకపోతున్నట్టు పార్టీ వర్గాల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది.