Begin typing your search above and press return to search.

బీజేపీకి బై.. టీఎంసీ టికెట్ పై ఇక సీనియర్ స్టార్ హీరో పోటీ

By:  Tupaki Desk   |   14 March 2022 3:30 AM GMT
బీజేపీకి బై.. టీఎంసీ టికెట్ పై ఇక సీనియర్ స్టార్ హీరో పోటీ
X
సినీ నటుడు,రచయిత శత్రుఘ్న సిన్హా అనూహ్య రీతిలో సొంత పార్టీ కాంగ్రెస్ ను కాదని.. టీఎంసీ అభ్యర్థిగా బెంగాల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మమతా బెనర్జీని కలిశారు. ఆదివారం కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో గొప్ప వాగ్ధాటి కలిగిన నేతగా పేరున్న సినీ నటుడు, రచయిత శత్రఘ్న సినర్హా అనూహ్య రీతిలో సొంత పార్టీని కాదని , టీఎంసీ అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం మమతా ఆదివారం కీలక ప్రకటన చేశారు.

బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా మొన్నటివరకూ బీజేపీలో వెలుగు వెలిగారు. అయితే ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయన బీజేపీకి దూరంగా జరిగారు. తాజాగా బెంగాల్ నుంచి టీఎంసీ తరుఫున ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. ఇదివరకూ సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహించి బీజేపీ తరుఫున కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించిన ఈ సీనియర్ నేత ఆ తర్వాత ఆ పార్టీకి దూరం అయ్యాడు.

కాంగ్రెస్ కు చేరువ అయ్యాడు. కాంగ్రెస్ తరుఫున కూడా రాజకీయ శక్తి చాటలేకపోయాడు శత్రుఘ్న సిన్హా.

ఈ క్రమంలోనే ఆ పార్టీకి కూడా దూరమై ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన ఎన్నికల పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ నేతగా వ్యవహరించిన బాబుల్ సుప్రియో రాజీనామాతో బెంగాల్ లోని అసన్ సోల్ లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ నుంచి శత్రుఘ్నను తమ అభ్యర్థిగా టీఎంసీ అధినేత్రి , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

బాబుల్ సుప్రియోను విధాన సభకు పోటీచేయిస్తూ శత్రుఘ్ణను లోక్ సభ బరిలోకి దించుతున్నట్టుగా మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీలో మోడీ, షాల పొడ గిట్టక ఆ పార్టీకి దూరమైన శత్రుఘ్ణ సిన్హా కాంగ్రెస్ ద్వారా మళ్లీ లోక్ సభలోకి ఎంటర్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ శత్రుఘ్నకు మరో అవకాశం కల్పించారు.

బెంగాల్ నుంచి శత్రుఘ్నను లోక్ సభకు పంపితే మోడీ, షాలను మమత మరింత ఉడికించినట్టుగా కావడం ఖాయంగా తెలుస్తోంది.