Begin typing your search above and press return to search.

టైమింగ్ పాటించాలంటున్న సుప్రీం న్యాయమూర్తి.. ఠంచన్ గా 9 గంటలకే రెడీ

By:  Tupaki Desk   |   15 July 2022 11:30 AM GMT
టైమింగ్ పాటించాలంటున్న సుప్రీం న్యాయమూర్తి.. ఠంచన్ గా 9 గంటలకే రెడీ
X
కోర్టు గురించి తెలిసిన చాలా మంది మరోసారి అక్కడికి వెళ్లాలనుకోరు. ఎందుకంటే కోర్టు కేసులంటే ఎంతో విలువైన సమయం దాదాపు ఖర్చయిపోతుంది. ఏ కేసయినా కోర్టుకు వెళ్లిందంటే అది పూర్తయ్యే వరకు సంవత్సరాలు పడుతుంది. అత్యవసరమైతే తప్ప సాధారణ కేసులన్నీ దాదాపు పెండింగులోనే ఉంటాయి. పెండింగ్ కేసులు పూర్తి చేయాలని ఎప్పటి నుంచో ఆదేశాలు వస్తున్నా.. అది సాధ్యం కావడం లేదు. దానికి కారణం ఆ కేసులు విచారణకు రాకపోవడమే. ఒకవేళ వచ్చినా సమయం తక్కువగా ఉండడంతో అవి వాయిదా పడుతూ వస్తున్నాయి.

దీంతో పెండింగ్ కేసులు అలాగే మూలుగుతున్నాయి. కొత్త కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు విచారణ సమయాన్ని కాస్త ముందుకు జరపాలని తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అన్నారు. జస్టిస్ ఉదయ్ లలిత్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరు కావాని అన్నారు.

పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఉదయం 7 గంటలకు రెడీ అయినప్పుడు ప్రాధాన్యం ఉన్న కేసులను విచారించడానికి న్యాయవాదులు 9 గంటలకు ఎందుకు రారని జస్టిస్ ఉదయ్ లలిత్ ప్రశ్నించారు.. సుప్రీం కోర్టు టైమింగ్స్ ఆలస్యంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేసులు పెండిగులోనే ఉంటున్నాయి.

రోజులో ఒక్క కేసు విచారణకు వస్తున్నా.. లంచ్, విశ్రాంతి లాంటి ఇతర కారణాలతో సమయం గడిచిపోతుంది. ఫలితంగా ఒక్క కేసు విచారణ పూర్తి కావడం లేదని అంటున్నారు. దీంతో కోర్టు సమయాన్ని ముందకు జరపాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం సుప్రీం కోర్టు 10.30 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ుంటుంది. ఆ తరువాత 4 గంటల వరకు కార్యకలాపాలు సాగుతాయి. ఇలా చేయడం వల్ల కోర్టు విలువైన సమయం కోల్పోతుంది. దీంతో మిగతా పనుల చేయడానికి టైం లేకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పుడున్న సమయానికి భిన్నంగా ఉదయం 9 గంటలకే కోర్టు కార్యకలాపాలు మొదలవ్వాలని ఉదయ్ యు లలిత్ అన్నారు. 11.30 గంటల తరువాత అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఆ తరువాత మళ్లీ 12 గంటల నుంచి ప్రారంభించాలన్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుందని తెలిపారు.

ఇదిలా ఉండగా జస్టిస్ ఉదయ్ ఓ కేసు విచారణను ఉదయం 9. 30 గంటలకు ప్రారంభించారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాం కు ధూలయా ఉన్నారు. మిగతా న్యాయమూర్తులు కూడా తమ విచారణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇలా ముందుగా విచారణను ప్రారంభించిన లలిత్ ను మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభినందించారు. కోర్టులు తమ విధులు ఉదయం 9 గంటలకు ప్రారంభించడం చాలా చక్కని సమయమని అన్నారు.