Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంః టెన్నిస్ స్టార్ జ‌కోవిచ్ పై సెక్స్ బాంబ్‌.. రూ.అర‌కోటి బేరం!

By:  Tupaki Desk   |   24 March 2021 5:30 AM GMT
సంచ‌ల‌నంః టెన్నిస్ స్టార్ జ‌కోవిచ్ పై సెక్స్ బాంబ్‌.. రూ.అర‌కోటి బేరం!
X
కొంద‌రు మ‌నుషుల‌ బుద్ధి ఎలాంటిదో..? ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దో..? చాటిచెప్పే ఘ‌ట‌న ఇది. మన ప‌ని మ‌నం చేసుకుంటూ పోతున్నా.. కూడా ఓ‌ర్వ‌లేనివారు ఈ స‌మాజంలో అడుగుకొక‌రు క‌నిపిస్తుంటారు. ఈ కుళ్లు బుద్ధి ముదిరిన‌వాళ్లు మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారి, ఇత‌రుల‌ను నాశ‌నం చేయ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి వారిలో కొంద‌రు టెన్నిస్ క్రీడ‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ గా వెలుగొందుతున్నాడు నొవాక్ జ‌కోవిచ్ ను టార్గెట్ చేశారు!

జ‌కోను ఎలాగైనా డీఫేమ్ చేయాల‌ని ప్లాన్ వేశారు. ఇందుకోసం సెక్స్ బాంబును కూడా సిద్ధం చేశారు. ఆమె ఎవ‌రో కాదు.. సెర్బియాకు చెందిన మోడ‌ల్ న‌టాలియా సెకిచ్‌. ఈమెతో డీల్ మాట్లాడారు. జ‌కోవిచ్ పై వ‌ల‌పు వ‌ల విసిరి, అత‌నితో గ‌డిపిన స‌న్నివేశాల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇస్తే.. రూ.52 ల‌క్ష‌లు చెల్లిస్తామ‌ని ఓ వ్య‌క్తి ఆఫ‌ర్ చేశాడ‌ట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా న‌టాలియా సెకిచ్ వెల్ల‌డించింది. త‌న‌కు తెలిసిన ఓ వ్య‌క్తే ఈ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని తెలిపింది. అయితే.. ఇలా చేసేందుకు తాను అంగీక‌రించ లేద‌ని చెప్పింది. జోకోవిచ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆయ‌న పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ను దెబ్బ‌తీయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పింది. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది న‌టాలియా.