Begin typing your search above and press return to search.

టీమిండియా క్రికెటర్లపై సంచలన ఆరోపణలు.. నిజమెంత?

By:  Tupaki Desk   |   13 Nov 2021 8:38 AM GMT
టీమిండియా క్రికెటర్లపై సంచలన ఆరోపణలు.. నిజమెంత?
X
టీమిండియా ఆటగాళ్లపై అత్యాచార ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మీడియాలో ఇప్పుడు ఇదే విషయంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు సంచలనమైంది. టీమిండియా ముగ్గురు క్రికెటర్లు తనపై లైంగిక దాడి చేశారని ముంబై పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసిందన్న వార్త నిన్నటి నుంచి మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూపుతో ఆమెకు ఉన్న లింకులేంటి? అన్నది సంచలనంగా మారింది.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య ఈ ఆరోపణలు చేసింది. డాన్ కు అనుచుడైన రియాజ్ కు మహారాష్ట్రలోని వీఐపీలంతా సుపరిచితులే..

తాజాగా రియాజ్ పై అతడి భార్య ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద పెద్ద వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. తన భర్త రియాజే బలవంతంగా తనను వీఐపీల దగ్గరకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ ఫిర్యాదు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక మహిళ తాను రెండు నెలలుగా కేసు పెట్టాలని వేడుకుంటూ ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. రెహ్నుమా ఫిర్యాదులో క్రికెట్ స్టార్స్ హార్ధిక్ పాండ్యా, మునాఫ్ పటేళ్ల పేర్లతో పాటు బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్ శుక్లా పేరు కూడా ఉండడం సంచలనమైంది.

ఈ ముగ్గురి దగ్గరకు తన భర్త రియాజ్ బలవంతంగా పంపించాడన్నది రెహ్నుమా ఆరోపణ. ముంబై ట్రైడెంట్ హోటల్ లో హార్ధిక్ పాండ్యా, అతడి స్నేహింతులు, కాంటినెంటెల్ హోటల్ లో మునాఫ్ పటేల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ చేసిన ఫిర్యాదు కాపీ లో ఉంది.

ఇక బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా, అతడి స్నేహితులు లైంగిక దాడి చేయడంతోపాటు చిత్రవధకు గురిచేశారని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు ఫిర్యాదు దేశంలో సంచలనమైంది. దీనిపై నిజనిజాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై ఇంతవరకూ స్పందించలేదు.