Begin typing your search above and press return to search.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ పై అంబేడ్కర్ మనుమడు సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 15 April 2023 9:41 AM GMTహైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్ కోరారు. అంబేడ్కర్ ఇదే అంశాన్ని ఎప్పుడో లేవనెత్తారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే బాగుంటుందని తన మనసులో ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇదే కోరుకుంటారని ఆశిస్తున్నానన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రకాష్ అంబేడ్కర్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా ఉండాలని అంబేడ్కర్ బలంగా కోరుకున్నారని ప్రకాష్ అంబేడ్కర్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ.. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలోనే ఉందని గుర్తు చేశారు. శత్రు దేశాలు దేశ రాజధానికి ఇంత దగ్గరగా ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ రాజధానిగా ఉన్నంతవరకు దేశ రక్షణ సంపూర్ణంగా ఉండదని కుండబద్దలు కొట్టారు.
ఈ నేపథ్యంలో దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ కావాలని అంబేడ్కర్ కన్న కలలను నిజం చేయాలని కోరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేసేందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు.
దేశ విభజన, హిందూ, ముస్లింల పైనా ప్రకాష్ అంబేడ్కర్ హాట్ కామెంట్స్ చేశారు. హిందువులు, ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని అంబేడ్కర్ 1938లోనే చెప్పారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే దేశ విభజన జరిగిందన్నారు. ఇప్పటికే ఒకసారి మతం ఆధారంగా దేశ విభజన జరిగిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ హిందూ దేశం డిమాండ్ లేవనెత్తడం అర్థరహితమని అన్నారు.
ఎప్పుడైతే దేశంలో కులం, మతం ఆధారంగా రాజకీయాలు మొదలవుతాయో.. అప్పుడు దేశంలో జాతీయ నాయకుడు అనే వారే ఉండరని అప్పట్లోనే అంబేడ్కర్ చెప్పారని ప్రకాష్ అంబేడ్కర్ గుర్తు చేశారు. నేడు దేశంలో ఒక్క జాతీయ నాయకుడు కూడా లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీనే ఎదిరించిన అటల్ బిహారీ వాజ్‌పేయి తన దృష్టిలో చివరి జాతీయ నాయకుడని కొనియాడారు.
ప్రస్తుతం జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగేందుకు రాష్ట్రాల్లోని నేతలకు మంచి అవకాశం వచ్చిందన్నారు. వీరికి ప్రజామోదం లభించాలని కోరుకుంటున్నానన్నారు. కుల మతాల ఆధారంగా జరిగే రాజకీయాలకు దూరంగా ఉంటామని అందరం శపథం చేయాలని ప్రకాష్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు.
70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా నేటికీ అంబేడ్కర్ ఆలోచనలు దేశ ప్రజల ముందుకు పూర్తిగా రాలేదని ప్రకాష్ అంబేడ్కర్ తెలిపారు. అంబేడ్కర్ ఆలోచనలు కేవలం దళితులు, బలహీన వర్గాలకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని ఆయన కలలు కన్నారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ నేడు దేశంలో మతం ఆధారంగా మైనార్టీలుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అప్పట్లో కేంద్రంతోపాటు, అంబేడ్కర్ కూడా వ్యతిరేకమని ప్రకాష్ అంబేడ్కర్ వెల్లడించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయనంత వరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ ను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అంబేడ్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని వెల్లడించారు. ఆర్థికంగా మనగలగడం, భౌగోళిక అంశాల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని అంబేడ్కర్ పదేపదే చెప్పేవారని, ఇప్పుడు అది నిజమవుతోందన్నారు.
రూపాయితో బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ఆడుకుందో, దేశాన్ని ఎలా దోచుకుందో 1923లోనే ప్రాబ్లం ఆఫ్ రూపీ అనే పుస్తకంలో అంబేడ్కర్ వివరించారన్నారు. ఈ దోపిడీ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ప్రస్తుత కాలాన్ని బట్టి ఈ సమస్యను 'థియరీ ఆఫ్ లూట్'గా అభివర్ణించారు.
అయితే ప్రకాష్ అంబేడ్కర్ ప్రతిపాదనలకు కేసీఆర్ అంగీకరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశానికి హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ నగరం మొత్తం కేంద్రం పాలనలోకి వెళ్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించేటప్పుడు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్లు తలెత్తాయి. ఆ సందర్భంగా తల లేని మొండేన్ని మాకు ఇస్తే ఏం చేసుకోవాలంటూ కేసీఆర్ తోపాటు టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో భారీ ఎత్తున ఉన్న ఎస్సీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి, ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు వారి ఓట్లతో విజయం సాధించడానికి 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ పూనుకున్నారన్నది నిజమని అత్యధిక శాతం నమ్ముతున్నారు. తద్వారా ఎస్సీలను, అంబేడ్కర్ భావజాలాన్ని నమ్మేవారిని కేసీఆర్ ఆకట్టుకోవాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్ కోణంలోనే ఆలోచించి హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేస్తామని.. అది అంబేడ్కర్ కోరిక అని చెప్తే కేసీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడటం ఖాయమంటున్నారు.
అంబేడ్కర్ విగ్రహం, సచివాలయానికి ఆయన పేరు వరకు ఓకే కానీ దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని అంటున్నారు,. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అత్యధికం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఇప్పుడు ఇది దేశానికి రెండో రాజధాని అయితే ఆదాయం మొత్తం కేంద్రానికి పోతుంది. ఈ నేపథ్యంలో బంగారు బాతు గుడ్లు పెట్టే హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా కేసీఆర్ ఒప్పుకోరని.. కేంద్రం ఒకవేళ ఈ నిర్ణయానికి వచ్చినా ఆయన అడ్డుకోవడానికి మరో ఉద్యమం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.