Begin typing your search above and press return to search.

పంచాంగ శ్రవణంలో సంచలనం: కేంద్రంలో ఓ నాయకుడి మరణం

By:  Tupaki Desk   |   2 April 2022 3:30 PM GMT
పంచాంగ శ్రవణంలో సంచలనం: కేంద్రంలో ఓ నాయకుడి మరణం
X
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం ఆలపించారు. శుభకృత్ నామ ఉగాది సంవత్సరం అందరికీ శుభాలను చేకూరుస్తుందని భావిస్తూ ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడు సంవత్సరాలుగా ఉగాది పండుగకు దూరంగా ఉన్న తెలుగు ప్రజలు ఈసారి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ పండుగను జరుపుకున్నారు.

పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలతో ఉగాది పర్వదినం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది.గాంధీ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ లతోపాటు పలువురు ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. పంచాంగ పఠనంలో వేద పండితులు శ్రీనివాసమూర్తి పలు సంచలన విషయాలను వెల్లడించారు.

ఈ సంవత్సరం కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణప్రభుత్వాలు నిరంకుశ పాలనలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తాయని శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఇక కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఉందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తన విశ్వరూపం చూపిస్తారని శ్రీనివాసమూర్తి తెలిపారు.

పంచాంగ శ్రవణం తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యల కోసం ప్రజల తరుఫున సమరోత్సాహంతో పనిచేస్తామని వెల్లడించారు. ఈ ఉగాది ప్రజల కష్టాలను దూరం చేయాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటివరకూ 42 లక్షల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. 80 లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు.